//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రభాస్ అభిమానులకు డబుల్ ట్రీట్..!

Category : movies

న్యూ ఇయర్‌లో అభిమానుల కోసం ఓ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నాడట ప్రభాస్. ప్రస్తుతం 'సాహో'తో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ ఏడాది ఫ్యాన్స్‌కు ఇవ్వబోతున్నాడు. 'బాహుబలి' సిరీస్‌కు ఐదేళ్లు కేటాయించిన ప్రభాస్ ఈ సినిమా తర్వాత చకచకా సినిమాలు చేసేస్తాడనుకున్నారు. కానీ 'సాహో' సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకే ఆలస్యం కాగా విదేశీ షెడ్యూల్స్‌కు అనుమతి దొరక్క మరింత ఆలస్యమవుతోంది. దీంతో ఈ ఏడాది కూడా ప్రభాస్ ఈ ఒక్క సినిమాతో సరిపడతాడనే ప్రచారం మొదలైంది. అయితే ప్రభాస్ ప్లాన్ మరోలా ఉందట.

సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'సాహో' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుండగా త్వరలో మలేషియా వెళ్ళబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు ఈ ఏడాది మరో సినిమాను జనం ముందుకు తీసుకురావడం ఖాయమంటున్నాడట ప్రభాస్.'సాహో' తర్వాత ప్రభాస్ 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధమై చాలా కాలమైంది.

ప్రభాస్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. దీంతో ఈ ఏడాది మరో నాలుగు నెలలు 'సాహో'కే కేటాయిస్తున్నాడు ప్రభాస్. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉన్న చిత్రం కావడంతో పోస్ట్ ప్రొడక్షన్‌కు కొంత సమయం పట్టొచ్చు. ఈలోగా రాధాకృష్ణ మూవీ మొదలెడతాడట ప్రభాస్. సో ఈ ఏడాది ప్రథమార్థం 'సాహో'కు ద్వితియార్థం రాధాకృష్ణ సినిమాకు కేటాయించబోతున్నాడట.

అంతే కాదు ఈ రెండు చిత్రాలు ఈ ఏడాదే విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నది యూవీ క్రియేషన్స్ కాబట్టి సినిమాల విడుదల తేదీల విషయంలోనూ ఇబ్బంది లేకపోవచ్చు. మరి ఈ ఏడాది ప్రభాస్ అభిమానులకు డబుల్ థమాకా ఇస్తాడో లేదో చూడాలి.