హాంగ్‌కాంగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.డబుల్ డెక్కర్ బస్సు బోల్తా పడటంతో 19 మంది మృతి చెందగా,60 మందికి పైగా గాయాలయ్యాయి.పదిహేను మంది పురుషులు,ముగ్గురు మహిళలు మృతిచెందారు.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 21 మంది పరిస్థితి విషమంగా ఉంది.వివరాల్లోకి వెళ్తే,
అభిమానులు హార్స్ రేసులను వీక్షించడానికి వేసిన ప్రత్యేక బస్సు,థాయ్ పో నుంచి షాటిన్ రేస్‌కోర్స్ వెళ్తుండగా ఈప్రమాదం చోటు చేసుకుంది.అప్పటికే 10 నిముషాలు లేట్ అని ఒక పాసెంజర్ అనగా ఆ మాటలకు తాను ఇంకా వేగంగా వెళ్లడం వల్ల అదుపుతప్పి ప్రమాదానికి గురి అయ్యింది అని తెలుస్తోంది.బస్సు బోల్తా పడిన అనంతరం రోడ్డు పక్కనే ఉన్న బస్సు స్టేషన్‌పైకి దూసుకెళ్లింది.బోల్తా పడిన తర్వాత రెస్క్యూ సిబ్బంది బస్సు టాప్‌ను కట్ చేసి అందులో ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు తీశారు.
ఈ ఘటనపై కోవ్లోన్ మోటర్ బస్సు కంపెనీ లిమిటెడ్ మేనేజర్ సో వాయ్ కీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలిపారు.ఒక్కో బాధిత కుటుంబానికి 80,000 హాంగ్‌కాంగ్ డాలర్లు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.