//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోరుకున్న వారికి కోరుకున్నట్లు ఇస్తాం !

Category : politics

టిఆర్ఎస్ నేత మంత్రి హరీష్ నేడు భూనిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. బైలంపూర్, తాడేదాసుపల్లి, మామిద్యాల తాడేదాన్‌పల్లి తండాకు చెందిన భూనిర్వాసితుల కోసం 1,700 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టనున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ భూనిర్వాసితులు ఎక్కడ కోరుకుంటే అక్కడ వారికీ ఇల్లు కట్టిస్తామన్నారు.

ఇల్లు వద్దు ఇళ్ల బదులు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తామన్నారు. ఆరు మాసాల్లోనే ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ప్రతి పదిహేను రోజులకి ఒకసారి వచ్చి ఈ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తామన్నారు. అన్ని సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణం నిర్మించబడుతుందన్నారు. లేటెస్ట్ సౌకర్యాలతో స్మశాన వాటికని, కొత్త కాలనిలో గుడిని నిర్మిస్తామన్నారు.

అంతేకాక కొండపోచమ్మ సాగర్ కింద 2,80,280 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు, ఇందులో భూనిర్వాసితులకు చేపలు పట్టుకునే హక్కును కల్పిస్తామని హామీ ఇచ్చారు. అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ముంపు బాధితులకే మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్ కూడా ముంపు బాధితులే, ముంపు బాధితుల బాధేంటో సీఎం కు తెలుసునన్నారు. వీలైనంత త్వరగా ఈ నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్నారు.