//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎరక్కపోయి ఇర్రుకుపోవడం అంటే ఇదే..!

Category : national

ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదే.ఈ మధ్య సెల్ఫీలు ప్రమాదంగా మారాయి.మొబైల్ చేతిలో ఉంటే చాలు.కెమెరాలో ఫోటో క్లిక్ మనాల్సిందే.ఇక యూత్‌కు ఉండే సెల్ఫీల పిచ్చే వేరు.సరదాగా ఓ ఫోటో దిగడం వెంటనే ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడం అందరికి ఫ్యాషన్‌గా మారింది.

అయితే తమిళనాడులో మాత్రం సెల్ఫీ పిచ్చి ఓ కుర్రాడిని జైలుకు పంపింది.అదేంటని ఆశ్చర్యపోకండి.అవును అతడు తీసుకున్న సెల్ఫీనే కష్టాల్లోకి నెట్టేసింది.తెలియక చేసిన పనికి తన ఫ్రెండ్‌తో కలిసి ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది.

చెన్నై వీఎ‌మ్ స్ట్రీట్‌కు చెందిన శశికుమార్ దర్గా వీధిలోని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు.అక్కడ అటు ఇటు తిరుగుతూ ఇంటి టెర్రస్ పైకి వెళ్లాడు.అక్కడ మొక్కలు, పూలతో అందంగా కనిపించింది.ఇంకేముంది జేబులో మొబైల్ బయటకు తీశాడు.సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపాడు.

ఫ్రెండ్ ఇంటి నుంచి వెళ్లాక అక్కడ తీసుకున్న ఫోటోలన్నీ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు.అందులో కుర్రాడు ఓ మొక్కతో ఫోటో దిగాడు.ఈ సెల్ఫీనే అతడ్ని జైలుపాలు చేసింది.ఇంతకీ శశికుమార్ చేసిన తప్పెంటో తెలుసా గంజాయి మొక్కతో కలిసి ఫోజు ఇవ్వడం.ఫేస్‌బుక్‌లో ఈ సెల్ఫీ వైరల్‌గా మారింది.

అది మెల్లిగా పోలీసుల దగ్గరకు చేరింది.ఈ వ్యవహారంపై ఆరా తీసి శశికుమార్‌ను అరెస్ట్ చేశారు.అతడ్ని ఆరా తీస్తే మొత్తం స్టోరీని పూస గుచ్చినట్లు చెప్పాడు.వెంటనే మొక్కను పెంచిన కమల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో మూర్తి అనే మరో వ్యక్తిని కటకటాల్లోకి నెట్టారు.

శశికుమార్, కమల్, మూర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ముగ్గురు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు.ఈ వార్త ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.పాపం శశికుమార్ ఎరక్కపోయి ఇరక్కుపోయాడు.ఏదో సరదాగా సెల్ఫీ దిగితే ఏకంగా జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.