హెచ్-1బీ వీసాల వ్యవహారంలో భారత్‌పై భారీ ప్రభావం పడేలా నిర్ణయం తీసుకున్నా ట్రంప్, అమెరికా ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం భారతీయులకు అధిక ప్రాధాన్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్నారనే చెప్పవచ్చు . ఇప్పటికే అనేకమంది భారతీయులను తన ప్రభుత్వంలో కీలక పదవుల్లో నియమించిన ట్రంప్, తాజాగా మరో భారతీయుడికి అవకాశం కల్పించారు. 40 ఏళ్ల వయసున్న నీల్ చటర్జీ అనే భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అమెరికా పవర్ గ్రిడ్, కోట్లాది రూపాయల విలువ చేసే ప్రాజెక్టులను పర్యవేక్షించే ఫెడరల్ ఎనర్జీ రెగ్యూలేటరీ కమీషన్ మెంబర్‌గా చటర్జీని నామినేట్ చేశారు. 30 జూన్ 2021 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో కీలకశాఖల్లో ముఖ్య అధికారిగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయనకు ఈ అవకాశం కల్పించారు. చటర్జీతోపాటు అమెరికాకు చెందిన మరోవ్యక్తి మెక్లిన్టైర్ వీరి ఇద్దరూ ఏ తేదిన ప్రమాణస్వీకారం చేయనున్నారనే విషయాన్ని సెనేట్ నిర్ధారించాల్సి ఉంది.