//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆధార్ ను బహిర్గతపరిస్తే మూడేళ్లు జైలు

Category : national

సంక్షేమ పథకాలకు కొరకు ఇచ్చిన లబ్ధిదారుల వివరాలను రహస్యంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలను సూచించింది. అలా కాకుండా వివరాలను బహిరంగా పరిస్తే దానికి బాద్యులైనవారు మూడేళ్లు జైలు శిక్షకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించింది. లబ్ధిదారుల పేర్లను ఆన్ లైన్ ద్వారా వ్యక్తపరచడం క్రమేణా అన్ని శాఖల్లో పెరుగుతుంది. మరో వైపు ప్రతి లబ్ధిదారుడికి ఆధార్ ను అనుసంధానం చేయటం ఇప్పుడు అమల్లోకి వచ్చింది. 2016 ఆధార్ చట్టం ప్రకారం లబ్ధిదారుల వివరాలను బహిర్గత పరచకూడదు. కానీ దీని పట్టించుకోకుండా కొన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాల్లోని శాఖలు లబ్ధిదారుల వివరాలను ఆన్ లైన్ లో వెల్లడిస్తున్నట్లు కేంద్రం దృష్టికి వెళ్ళింది. దీనితో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ ...చట్టాల్లోని నిబంధలను గుర్తుచేస్తూ తాజాగా ఒక ఉత్తర్వును జారీచేశాయి. దీనిప్రకారం ఆయా శాఖల వెబ్ సైట్లలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సమాచారంని వెంటనే తొలిగించాలని సూచించింది.