//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భార్య పై భర్త గృహ హింస కేసు

Category : national

భార్యలు..అత్తామామలు, భర్తలు వేధిస్తున్నారని గృహహింస చట్టం కింద కేసులు పెట్టటం సహజంగా మనం వింటూనే ఉంటాం. కానీ భర్త...భార్య, అత్తామామలు వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పు గృహహింస చట్టం కింద కేసు పెట్టాడు. ఇది కొంచం వినటానికి ఆశ్చర్యకరంగానే ఉన్నా నమ్మాల్సిందే మరి. భార్య, అత్తామామలు వేధింపులకు గురి చేస్తున్నారని, వారినుంచి రక్షణ కల్పించాలని కోరుతూ కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి గృహహింస చట్టం కింద కోర్టులో కేసు దాఖలు చేశాడు.

కరీంనగర్‌లోని హుస్సేనిపురకు చెందిన అబ్దుల్ మన్నాన్, కాన్‌పురకు చెందిన ఫాతిమా 2016లో ప్రేమ పెండ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఉండి మలేషియాకు వెళ్లాలని యత్నించినా, అనుమతి లభించకపోవడంతో కరీంనగర్‌కు వచ్చి స్నేహితుడి ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత ఫాతిమా కుటుంబసభ్యులు ఒప్పుకోవడంతో భార్యాభర్తలు హైదరాబాద్‌కు మకాం మార్చారు. కొంతకాలానికి ఫాతిమాను ఆమె తండ్రి కరీంనగర్ తీసుకొచ్చాడు. కొన్ని రోజులకు భార్య వద్దకు వెళ్తే.. ఫాతిమా పైచదువులు చదువుకుంటున్నదని, ఆమెకు విడాకులు ఇవ్వాలని అత్తింటి వారు బెదిరించారని మన్నాన్ కోర్టుకు విన్నవించాడు.

వరకట్న వేధింపులకు గురిచేసినట్టు తనపై తప్పుడు కేసు నమోదుచేశారని, తనను అరెస్టు చేయించారని వివరించాడు. అత్తమామ, వారి కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలని, మానసిక హింసకు గురిచేసినందుకు భార్య ఫాతిమా తనకు రూ.20 లక్షల నష్ట పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరాడు. భార్య తన వద్దకు వచ్చేలా చూడాలని విన్నవించాడు. కరీంనగర్ అదనపు జుడిషియల్ మెజిస్ట్రేట్ సంపతీరావు చందన.. ఫాతిమా, ఆమె కుటుంబసభ్యులకు నోటీసులు జారీచేశారు.