డాగ్ ఫెస్టివల్ టైమ్ లో డాగ్ మీట్ ను చైనీయులు లొట్టలేసుకుంటూ లాగిస్తారట. రెస్టారెంట్లు అన్నీ డాగ్ మీట్ స్పెషల్ ఐటమ్స్ తో కళకళలాడతాయట. దాదాపు 10 రోజులు సాగే ఈ ఫెస్టివల్ టైమ్ లో యులిన్ లో ఉన్న మార్కెట్లలో ఎక్కడ చూసినా వేలాడదీసిన కుక్కలు, కుక్క మాంసం, కుక్క తలలే కనిపిస్తుంటాయి.
చైనాలో ప్రతి యేటా దాదాపు 10 లక్షల నుంచి 20 లక్షల కుక్కలను మాంసం కోసం చంపుతున్నారట. ఇక ఫెస్టివల్ సమయంలోనూ ఎన్నో కుక్కలు తమ ప్రాణాలను కోల్పోతున్నాయో. బుధవారం ప్రారంభమై పది రోజుల పటు సాగే ఈ ఫెస్టివల్ పట్ల జంతు హక్కుల బృందాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ఫెస్టివల్ ను నిర్వహించకుండా అడ్డుకోవడానికి యానిమల్ రైట్స్ గ్రూప్స్ ఎంతో ప్రయత్నించినప్పటికీ డాగ్ ఫెస్టివల్ ను మాత్రం ఆపలేకపోయాయి. చైనాలో కుక్క మాంసాన్ని తినడం నేరం కాకపోయినప్పటికీ యానిమల్ రైట్స్ గ్రూప్స్ కుక్క మాంసాన్ని చైనాలో బ్యాన్ చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ప్రతి ఏటా చైనాలోని గాంగ్జీ రీజియన్ లోని యులిన్ లో డాగ్ ఫెస్టివల్ ను నిర్వహించడం ఆనవాయితి. ప్రతి ఏటా ఈ డాగ్ ఫెస్టివల్ పేరుతో వేల సంఖ్యలో కుక్కలను బలి ఇస్తారు. కుక్క మాంసం టేస్ట్ రావడం కోసం వాటిని వేడి వేడి నీళ్లలో బతికుండగానే ముంచుతారట. తీవ్రంగా వాటిని గాయపరిచి ఆ తర్వాత వేడి నీళ్లలో ముంచి అవి చనిపోయిన తర్వాత వాటిని కాల్చి అప్పుడు ముక్కలు ముక్కలుగా నరుకుతారట.