//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆపరేషన్ కి బదులు తంత్ర పూజలు.. వైద్యంలో ఇది ఒక భాగం..!

Category : national

డాక్టర్ చేసిన పొరపాటుకు ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్ర పూణే కు చెందిన సంధ్య సోనావానే అనే మహిళా ఛాతి పై బోబ్బా రావడంతో దగ్గరగా ఉన్న స్థానిక డాక్టర్ సతీష్ చవాన్ వద్దకు వెళ్ళింది. సతీష్ చవాన్ కొన్ని రోజులు వైద్యం అందిచగా, తగ్గకపోగా మరింత ఎక్కువైంది. పరిస్థితి విషమిస్తుందని భావించిన డాక్టర్ చవాన్ ఆపరేషన్ చెయ్యాలని ఆమెను దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రికి తరలించాడు. ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ కి బదులు తంత్ర పూజలు జరిపించాడు. చివరకు ఆమె ప్రాణం పోగెట్టేసాడు.

సంధ్య సోనావానే కుటుంబీకులు ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఆమె కోలుకోవాలని ఆందోళన చెందతున్న సమయంలో డాక్టర్ చేసిన వింత చేష్టలకు మొదట భయబ్రాంతులకు గురయ్యారు. తరువాత నిలదీశారు. చివరికి ఆమెను కోల్పోయారు. ఐసియూలో డాక్టర్ ఆపరేషన్ చేసి తనకు నయం చేస్తాడని వేచి ఉన్న కుటుంబీకులు, ఆపరేషన్ గదిలోకి డాక్టర్ తో పాటు ఓ తంత్ర పూజలు చేసే వ్యక్తి వెళ్లడం చూసి ఆపరేషన్ చెయ్యాల్సింది పోయి ఈ తంత్ర పూజాలేంటి అని నిలదీయగా, ఇది కూడా వైద్యంలో ఒక భాగం అంటూ నమ్మబలికాడు. ఎందుకైనా మంచిది అనుకున్న కుటుంబీకులు ఆ కధనాన్ని మొబైల్ లో చిత్రీకరించారు. దింతో డాక్టర్ బండారం బట్టబయలైంది.

తాను తీసుకున్న గోతిలో తను పడతాడని ఊహించుకోలేదు. వైద్యం సరిగా అందిచకపోవడంతో పరిస్థితి చెయ్యిదాటిపోయింది అని తెలుసుకొని ఎక్కడ తను ఇర్రుక్కుపోతానో అనే ఉద్దేశంతో తంత్రం ద్వారా ఐనా తనను బ్రతికించాలని ప్రయతించాడు. కానీ సీన్ రివర్స్ అయింది. వైద్యం సరిగా చేయకపోవడం వల్ల చనిపోయిన తను, డాక్టర్ చేతబడి చేయించి తన చావుకు కారణం అయ్యాడంటూ కుటుంబీకులు నేర ఆరోపణ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ సతీష్ చవాన్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.