//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైస్సార్సీపీ కీలక నేత పార్టీ కి రాజీనామా చేస్తారా ?

Category : politics state

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టికెట్ ఆశిస్తున్న నేతల్లో టెంక్షన్ మొదలైంది. నిరాశతో కొందరు లీడలు సొంత పార్టీలను ఒదిలి ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. అయితే ఇన్ని రోజులు వలసలు ఎక్కువగా వైకాపాలోకి ఉండగా ఈసారి వైకాపా నుండే ఒక బడా లీడర్ బయటికు వెళ్లే పరిస్థితి. వైఎస్ హయాం నుండి మదనపల్లె రాజకీయాల్లో కీలకంగా ఉంటూ వచ్చిన వ్యక్తి డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి. వైఎస్ మరణమే తరవాత వైకాపాలో చేరిన ఆయన వరుసగా ఆ పార్టీ నుండి రెండుసార్లు గెలుపొందారు. ఈసారి కూడా గెలిచే సామర్థ్యం ఆయనకు పుష్కలంగా ఉంది.

కానీ ఉన్నట్టుండి జగన్ ఆయనకు టికెట్ నిరాకరించినట్టు తెలుస్తోంది. అందుకు కారణం ఈసారి మదనపల్లెను మైనారిటీ అభ్యర్థి నవాజ్ కు కేటాయించాలని జగన్ నిర్ణయించారట. అధిష్టానం ఆఖరి నిముషంలో తీసుకున్న ఈ నిర్ణయంతో షాక్ తిన్న దేశాయ్ జగన్ మనసు మార్చడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో చేసేది లేక ఆయన ఈరోజు అనుచరులతో, మద్దతుదారులతో భేటీ ఏర్పాటుచేసుకున్నారు.

ఈ సమావేశంలో జగన్ నిర్ణయానికి తలవంచి నవాజ్ గెలుపుకు కృషి చేయడం లేదా వేరే పార్టీలోకి వెళ్లి టికెట్ పొందడం అనే రెండు దారుల్లో దేశాయ్ రెండో దారినే ఎంచుకోనున్నారట. అయితే ఆ దారి టీడీపీలోకి వెళుతుందా లేకపోతే జనసేనలోకి దారితీస్తుందా అనేదే ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇంకొద్దిసేపట్లో వైకాపాకు షాక్ తగలడం మాత్రం ఖాయం.