//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైద్యం పేరుతో ట్రైనీ నర్సుకు మత్తు సూది వేసిన వైద్యుడు.......!

Category : national

ఆడవాళ పై జరిగే హత్యాచారాలు రోజు రోజు కు పెరుగుతున్నాయి కానీ తగ్గటం లేదు లేదు.రోజు ఎక్కడో ఒకచోట ఆడవాళ్లు హత్యాచారానికి గురవుతున్నారు.కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు,మరి కొందరు తమ శీలం కోల్పోతున్నారు.మనం ఎంత అభివృద్ధి చెందుతున్న,ఆడవాళ్లపై కనీస బాధ్యత లేకుండా,గౌరవం లేకుండా ఉండటం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి.ఇలాంటి ఒక సంఘటన తమిళనాడు లో జరిగింది..వివరాలలోకి వెళ్తే..

సింగనల్లూరు పట్టణంలో డాక్టర్ రవీంద్రన్ ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు.దిండిగల్ ఇన్‌స్టిట్యూట్‌లో మొదటి సంవత్సరం నర్సింగ్ డిప్లొమా చదువుతున్న 11 మంది అమ్మాయిలు శిక్షణ పొందేందుకు రవీంద్రన్ ఆసుపత్రిలో చేరారు.17 ఏళ్ల ఓ ట్రైనీ నర్సు తాను జలుబుతో బాధపడుతున్నానని మందులు ఇవ్వమని డాక్టరును సంప్రదించింది.

అంతే డాక్టరు జలుబుకు చికిత్స చేస్తున్నట్టు చెప్పి మత్తు ఇంజక్షన్ వేశాడు. అనంతరం తన గదిలోకి తీసుకెళ్లి ట్రైనీ నర్సుతో కోర్కె తీర్చుకున్నాడు.ఆ తర్వాత సృహలోకి వచ్చిన ట్రైనీ నర్సు తనకు జరిగిన ఘోరం గ్రహించి సాటి విద్యార్థినిలకు చెప్పింది.

అలాగే,సదరు వైద్యుడి భార్యకు,కోయంబత్తూర్ ఛైల్డ్ లైన్ కో ఆర్డినేటరుకు ఫిర్యాదు చేశారు. చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సులేఖ ఫిర్యాదు మేర మహిళా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన డాక్టర్ రవీంద్రన్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.ట్రైనీ నర్సుకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.

ఎక్కడ ఉన్నా కూడా ఆడవాళ్లకి భద్రత లేదు అని మరోసారి నిజం చేసారు.ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం,సాటి ఆడవాళ్లకి బధ్రత ఇవ్వని మనం రేపు మన తల్లులకు పిల్లలకి భద్రత కల్పించగలమంటారా ఆలోచించండి.