//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫ్రీ వైఫై అని వాడేస్తున్నారా..?అయితే మీ కొంప కొల్లేరే

Category : business

మనం ఎక్కడికైనా వెళ్తే అక్కడ వైఫై ఫ్రీ గా వస్తుంది అంటే చాలు.. ఇక నెట్ వినియోగానికి వెనుకాడం. సొమ్ము మనది కాకపోతే ఏదో చేసినట్టు పక్కన వాళ్ళ వైఫై కావడంతో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఇది అంత సేఫ్ కాదు అంటున్నారు పరిశోధకులు. అలా వైఫై నెట్వర్క్ పాస్వర్డ్ లేకుండా ఉందంటే దానికి అర్ధం వేరే ఉంటుందని...అలా పాస్వర్డ్ పెట్టుకోకుండా ఉన్నారంటే వాళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారని అర్ధమని అంటున్నారు.

అదేమిటో ఒక్కసారి చూద్దాం. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోవడంతో ప్రస్తుతం అందరు లావాదేవీలు అన్ని దీని ద్వారానే చేస్తున్నారు. అలాగే వ్యక్తిగత సమాచారం కూడా నిలువ చేసుకుంటున్నారు. దీని కోసమే హ్యాకర్లు రంగంలోకి దిగి కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. వాటిలో భాగంగానే ఇలా వైఫై పాస్వోర్డ్ లేకుండా ఉంచడం. వైఫై నెట్‌వర్క్‌కు మీరు కనెక్ట్‌ అయిన వెంటనే ఇక మీ ఫోన్‌ ద్వారానూ, ల్యాప్‌టాప్‌ ద్వారానూ ఇంటర్నెట్‌కి..

కనెక్ట్‌ అయి పంపించే డేటా పాకెట్లు అన్నీ ఆ నెట్‌వర్క్‌ని క్రియేట్‌ చేసిన హ్యాకర్‌కి వెళ్లిపోతుంటాయి. ఈ పాకెట్లలో మీరు ఎంటర్‌ చేసిన యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లు కూడా నిక్షిప్తమై ఉంటాయి. పాకెట్‌ అనలైజర్లు అనే ప్రత్యేకమైన టూల్స్‌ నుపయోగించి మీ నుండి ఇంటర్నెట్‌కీ, ఇంటర్నెట్‌ నుండి మీకు ప్రసారం చేయబడే మొత్తం డేటాలోని కీలకమైన సమాచారాన్ని హ్యాకర్లు తస్కరిస్తుంటారు.” కాబట్టి కక్కుర్తి పడకుండా ఉంటె మంచిది అంటున్నారు.