ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి..? నేనేంటో చూపిస్తా..? అంటూ ఇటీవల కాలంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడ మీడియా కనపడినా చెబుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇదే విషయంపై వైసీపీ నేతలు స్పందిస్తూ గత 2014 సాధారణ ఎన్నికల్లోనూ ఇదే మాట చెప్తే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్లీ అదే చెప్తువున్నావ్ ఈ సారి ప్రజలకు కోపం వస్తే ఎక్కడ కూర్చోబెడుతారో అంటూ జగన్‌పై పెదవి విరుస్తున్నారు.
అలా, తన అనుచరుల పార్టీ నేతల ప్రవర్తనతో, వారిని నమ్ముకుంటే ఎప్పటికీ వైసీపీ అధికారంలోకి రాదని తెలుసుకున్న జగన్, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నమ్ముకున్నారట. ఆ క్రమంలోనే, నీకు నేను సాయం చేస్తా.. నాకు నువ్వు సాయం చెయ్యి అంటూ వస్తుమార్పిడి పద్ధతి రీతిలో ఓ మాస్టర్ ప్లాన్‌కు తెర తీశారు. కాగా, తెలంగాణలో టీఆర్ఎస్ను ఓడించేందుకు మహాకూటమిలోని కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ తీవ్రంగా కృషి చేస్తుంటే.. మరో పక్క టీఆర్ఎస్ విజయం కోసం కేవలం ఆ పార్టీ నేతలే కాకుండా, బీజేపీ, ఎంఐఎం నేతలు పాటుపడుతుండటం గమనార్హం. అయితే, వారందరిదీ ఓ ఎత్తయితే.. కేసీఆర్ కోసం జగన్ చేస్తున్న ప్రయత్నం మరో ఎత్తు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇంతకీ, కేసీఆర్‌తో కలిసి జగన్ వేసిన ఆ మాస్టర్ ప్లానేమిటన్న అంశంపైనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఇక అసలు విషయానికొస్తే, బీజేపీ, ఎంపీఐఎం పార్టీల్లానే వైసీపీ కూడా టీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందం చేసుకుందట. టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో ఆ పార్టీకి పరోక్ష మద్దతు తెలపడం, మహాకూటమి అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థుల ఓట్లను చీల్చడం అన్న మాట. ఇలా టీఆర్ఎస్కు ఓట్లను కూడగడుతూ.. మహాకూటమి అభ్యర్థుల ఓట్లను చీల్చేందుకు వైసీపీ నాయకులతో పక్కా ప్రణాళిక అమలు చేస్తామని వైఎస్ జగన్ కేసీఆర్‌కు హామీ ఇచ్చారట.
ఇదేనండీ, సీఎం కేసీఆర్‌కు జగన్ చేయబోయే అతి పెద్ద సాయం. ఇప్పటికే మహా కూటమి చేతిలో కేసీఆర్ ఓటమి తప్పదని పలు సంస్థల సర్వేలు వెల్లడించిన నేపథ్యంలో జగన్ చేస్తున్న ఈ చిరుసాయం ఎంత మేరకు కేసీఆర్‌ను కాపాడుతుందో అన్ని తెలియాలంటే ఎన్నికల ఫలితలు వెల్లడయ్యే వరకు వేచి చూడక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.