జన్మించిన వారు మరణించక తప్పదు,మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు.అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు మరణించక తప్పదు.ఒకవేళ అలా జరగలేదంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది.మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఎదో ఒక రోజు కచ్చితంగా చనిపోతాడు కాకపొతే కొద్దిగా వెనుక ముందు కానీ కచ్చితంగా మరణం అనేది మాత్రం తప్పదు.హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం, పురాణాల ప్రకారం మనిషి యొక్క ఆయువు తీరిన తర్వాత యమధర్మ రాజు వచ్చి వారి ఆత్మలను తీసుకువెళ్తాడని వారి నమ్మకం.కానీ యమధర్మ రాజు మనుషులు బ్రతికుండగానే వారు మరణానికి దగ్గరగా ఉన్నారు అని కొన్ని సూచనలను ఇస్తాడట అవి తెలుసుకుంటే మన మరణ వార్తా మనకు తెలిసినట్టే మరి ఎలా తెలుసుకోవాలి దీని గురించి ఒక కథ బాగా ప్రచారంలో ఉంది
అదేమిటో ఒకసారి తెలుసుకుందాం.పురాణ కాలంలో యమునా నది ఒడ్డున అమృతుడనే వ్యక్తి నివసించేవాడు.ఒక సందర్భంలో అతనికి తానూ చనిపోతే ఎలా అనే ఆలోచన పట్టుకొని మృత్యువు ఎప్పుడు ఎక్కడి నుండి వస్తుందో,ఎలా చనిపోతానో అని రోజు తలచుకుంటూ బయపడేవాడు.దీంతో అతను ఈ మృత్యు భయం పోవాలంటే యమధర్మరాజు ప్రత్యేక్షం కోసం ఘోర తపస్సు చేస్తాడు,అలా చేయడం వలన యమధర్మరాజు ప్రత్యక్షం అయ్యాడు.వెంటనే యమధర్మరాజు ఏమి వరం కావాలో కోరుకో అని అడగ్గా అందుకు అమృతుడు తానూ ఎప్పుడు చనిపోతానో,నేను చనిపోయే ముందు ఎలాంటి సూచనలు వస్తాయో తనకు తెలిసేలా చేయాలనీ కోరుతాడు.అలా సూచనలు ఇస్తే నా బాధ్యతలు అన్నింటిని అందరికి అప్పజెప్పేస్తా అని యమునికి చెప్తాడు.అమృతుడి కోరికను విన్న యముడు మరణం ఎప్పుడు వస్తుంది అనేది సృష్టి రహస్యం అని దానిని తెలుపలేను
అని కాకపొతే మరణం వచ్చే ముందు కొన్ని సూచనలు మాత్రం పంపుతానని వాటి ద్వారా మరణం ఎప్పుడు వస్తుందో ఒక అంచనాకు రావొచ్చు అని యముడు అమృతుడికి వరం ఇచ్చి మాయం అవుతాడు.కొన్ని రోజుల తర్వాత అమృతుడు యముడు చెప్పిన మాటలు మరచిపోతాడు. అలా ఏళ్ళు గడిచిపోయినా తరువాత తనకు పెళ్లి అవడం,పిల్లలు పుట్టడం,సంసారం వృద్ధి చేసుకోవడంలో అలాగే తన పిల్లలు పెద్దవారై వారికి పెళ్లి చేయడంలో మునిగిపోతాడు.ఒకరోజు అమృతుడికి యముడితో జరిగిన సంభాషణ గుర్తుకు వస్తుంది. కానీ తనకు యముడు నుండి ఎలాంటి సూచనలు రాకపోవడంతో తనకు ఇంకా చాలా ఆయువు ఉందనుకొంటాడు.ఒక రోజు అతని వెంట్రుకలు తెల్లబడిపోతాయి,చర్మం అంత ముడుతలుబడిపోతుంది.మరో రోజు తన పళ్లన్ని ఊడిపోతాయి అప్పుడు కూడా తన ఆయువు తీరలేదు అనుకుంటాడు.మరి కొంత కాలానికి తనకి కళ్లు కనిపించకుండా పోతాయి,చివరికి పక్షావాతం వచ్చి మంచాన పడుతాడు.ఈ రెండు సందర్భాలలో కూడా తన ఆయువు తీరలేదు అనుకుంటాడు.ఇక చివరికి ఒక రోజు యముడు వచ్చి నీఆయువు తీరింది అని అందుకే నీ ప్రాణాలను తీసుకువెళ్ళడానికి వచ్చాను
అని అమృతుడితో చెబుతాడు.ఆ మాటలకూ ఆశ్చర్యపోయిన అమృతుడు తనకు మరి చెప్పినట్టు చావు సూచనలు ఎలాంటివి రాలేదని,అయినా మీరు వచ్చి నా ప్రాణాలను తీసుకుపోతున్నారు మరి నాకు ఇచ్చిన వరం ఏమిటి అని అడుగుతాడు.దానితో యముడు నీ ఆయువు తీరింది నిన్ను తీసుకుపోవలసిందే అంటాడు.యముడు నీకు ఇచ్చిన వరం ప్రకారం 4 సూచనలు పంపించాను అని అవే 4 ఆనారోగ్యాలు అని ( వెంట్రుకలు తెల్లబడటం,పళ్లు ఊడిపోవడం,చూపు కోల్పోవడం,పక్షవాతం రావడం) అని అమృతుడికి యమధర్మరాజు వివరిస్తాడు. దానితో నిజం తెలుసుకొని అమృతుడు యముని వెంట వెళ్ళిపోతాడు.దీనిని బట్టి మనకు తెలిసిన విషయం మన ఆరోగ్యమే మనకు రక్ష,ఆరోగ్యం చెడిపోయిందో ఇక మనకు చావే గతి అని తెలుసుకోవాలి.మరొక విషయం ఏమిటంటే ఎంత ధనవంతుడైన,ఎంత పేదవాడు అయినా పుట్టుక చావు ఎవ్వరు ఆపలేరని తెలుసుకోవాలి బ్రతికున్న రోజులు మనం చనిపోయినా బ్రతికున్నవారి మనసులో ఎలా చిరంజీవిగా ఉండాలో తెలుసుకోవాలి.