//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఓటర్లకు రాజమౌళి ఏం చెప్పాడంటే

Category : politics

టాలీవుడ్ లో జక్కన్న రాజమౌళి తెలంగాణా ఎన్నికలపై చాలా ఆసక్తి తో ఉన్నారు. ఒక పక్క ఈ సారి అధికారం ఎవరి హస్తగతం అవుతుందో అన్న టెన్షన్ లో అభ్యర్థులు ఉంటె ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం అలోచించి ఓటు వెయ్యాలని పిలుపునిస్తున్నారు రాజమౌళి.

ప్ర‌తిక్ష‌ణం… త‌న సినిమాపై అంచ‌నాలు పెంచ‌డంలో భార‌తీయ సినిమాలో రాజ‌మౌళిని కొట్టేవారే లేరు. ప్ర‌తిదీ ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకెళ్లే రాజమౌళి తెలుగు సినిమ‌తోనే ఇండియా సినిమా రికార్డులను చెరిపేశారు. తాజాగా అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన మ‌ల్టీస్టార‌ర్‌తో ఆర్ఆర్ఆర్ సినిమాను మొద‌లుపెట్టిన రాజ‌మౌళి చాలా వేగంగా మొద‌టి షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఇందులో ఒక భారీ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో రామారావు, రాంచ‌ర‌ణ్ ఇద్ద‌రూ ఉంటారు. మ‌రి ఫైట్ వారిద్ద‌రి మ‌ధ్య‌నా కాదా అన్న‌ది తెలియ‌డం లేదు.

అద‌లా ఉంచితే… నా షూటింగ్ అయిపోయింది. ఓటేయ‌డానికి నేను రెడీ. మీరు రెడీయా? … ప్ర‌తి ఒక్క‌రూ ఓటేయండి. ప్ర‌జాస్వామ్యాన్ని నిర్మించే ఓటు అనే ఆయుధాన్ని వృథా చేయొద్దు…. క‌చ్చితంగా ఓటు వేయండి అని పిలుపునిచ్చారు. అత్యంత వేగంగా స్పందించిన ఆయ‌న ఫ్యాన్స్ మేము రెడీ అంటూ జైకొట్టారు. మరి ఇంతగా ఈ సారి సినీ వర్గాలు కూడా ఓటింగ్ శాతం పెంచటం కోసం నానా తిప్పలు పడుతున్నారు. మరి ఓటరు దేవుళ్ళు ఏం చేస్తారో.

Related News