//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ర‌వితేజ రాక‌కు ఆల‌స్యం ఏమిటో తెలుసా..?

Category : movies

ర‌వితేజ‌, శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్ల‌లో తెర‌కెక్కుతున్న నాలుగో సినిమా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని. రంగ‌స్థ‌లం త‌రువాత మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో వ‌స్తున్న చిత్రం ఇది. అక్టోబ‌ర్ 5న రిలీజ్ అంటూ రెండు నెల‌ల క్రిత‌మే ఎనౌన్స్ చేసినా.. చివ‌ర‌కు వ‌చ్చేస‌రికి పండ‌క్కి రావ‌డం లేదు. Do you know what is the reason for Ravi Teja Movie delay

పండ‌క్కి వ‌స్తున్న అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ షూటింగ్ ఇంకా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం స్విట్జ‌ర్లాండ్‌లో ఎన్టీఆర్, పూజాహెగ్దే పై ఒక పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. అక్టోబ‌ర్ 11న‌, కానీ, 12న కానీ ఈ చిత్రం రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ లెక్క‌న షూటింగ్ పూర్తి చేసుకున్న అమ‌ర్‌, అక్బ‌ర్ ఆంటోనీ ఎందుకు రిలీజ్ కావ‌డం లేద‌న్న సందేహంలో ఉన్నారు మాస్ రాజా అభిమానులు.Do you know what is the reason for Ravi Teja Movie delay

ట్రిబుల్ ఏ చిత్రం షూటింగ్ రీసెంట్‌గా పూర్తైనా, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌కు స‌మ‌యం స‌రిపోద‌ని, అందేకే వాయిదా వేశామంటున్నాయి చిత్ర వ‌ర్గాలు. ద‌స‌రా రేసులో నోటా, అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌, హ‌లో గురూ ప్రేమ కోస‌మే, పందెం కోడి - 2 వంటి నాలుగు సినిమాలు పోటీ ప‌డుతున్నాయి. కాంపిటీష‌న్‌లో కాకుండా, సోలోగా రిలీజ్ చేద్దామ‌న్న ఆలోచ‌న‌లో నిర్మాత‌లు ఉన్నార‌ని తెలిసింది. అయితే, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది.Do you know what is the reason for Ravi Teja Movie delay