//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవన్ లో మార్పుకు కారణం ఏమిటో తెలుసా.......!

Category : movies politics

రాజకీయాలను మారుస్తానంటూ భారీ స్టేట్మెంట్స్ ఇచ్చిన పవన్ ఇపుడు తానే మారిపోయారు. నిజమైన పొలిటీషియన్ అవతారం ఎత్తేశారు. కులాలు లేవంటూ కులల గురించి మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు వద్దంటూ తానూ ఇస్తానంటున్నారు.

అధికారంపై మోజు లేదంటూనే సీఎం అవుతానంటున్నారు. కేవలం నాలుగు నెలలు, ఇంతలో ఎంత మార్పు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఓట్ల వేట మొదలెట్టేశారు. సొంత సామాజిక వర్గం దండిగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ అక్కడ జనాలపై వరాల వానే కురిపించారు. సగటు రాజకీయ నాయకుడిలా అందరినీ ఆకట్టుకునేందుకు ట్రై చేశారు. ఒకప్పుడు ఏదీ కాదన్నారో అదే ఔనంటూ ముందుకెళ్తున్నారు.

రిజర్వేషన్ల అంశం బలమైనదని పవన్ అంగీకరించారు. అందుకే తానూ ఇస్తున్నానంటున్నారు. మహిళలకు చట్ట సభలలో 33 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన పవన్, కాపుల ఓట్లకూ గేలం వేశారు. చంద్రబాబు, జగన్ సీఎం అయితే పెద్ద వాళ్ళు పీఠమెక్కినట్లంట. పవన్ సీఎం అయితే మాత్రం సామాన్యుడే ముఖ్యమంత్రి అయినట్లుట. జనసేనాని భాష్యం అదిరింది కదూ. పవర్ వద్దంటూనే మరో వైపు సీఎం చేయండని చెబుతున్న పవన్ రాజకీయాలను బాగానే వంట బట్టించుకున్నాడు. చూడాలి మరి పవన్ మాటలని ప్రజలు ఎంతవరకు నమ్ముతారో...

Related News