//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లవ్ జీహద్ అంటే అర్ధం తెలుసా?

Category : national state

ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ పూర్వాశ్రమంలో స్థాపించిన ఒక సంస్థ హిందూ యువవాహిని. ఈ సంస్థకు చెందిన కార్యకర్తలు మీరట్ లోని శాస్త్రి నగర్ ప్రాంతంలో మంగళవారం ఒక ఇంట్లోకి చొరబడి ఒక యువజంట పై దాడి చేశారు. వారిలో ఒకడైన ముస్లిం యువకుణ్ణి మత మార్పిడులు చేస్తున్నారా అని గద్దించారు. ఆ యువతిని సైతం పలుప్రశ్నలు వేసి ఉక్కిరిబిక్కిరి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇరువురు ముస్లిం మతానికి చెందిన వారేనని తెలియటంతో వారిని విడుదల చేశామని మీరట్ పోలీసు కమిషనర్ అలోక్ ప్రియదర్శిని తెలిపారు. ఈ దాడికి కారణం లవ్ జీహాద్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని హిందూ యువవాహిని సభ్యులు తెలిపారు. ఇంతకీ లవ్ జీహాద్ అంటే ఏమిటి? కొంతమంది ముస్లిం యువకులు ప్రేమను నటించి అన్య మతస్థులను పెళ్ళి పేరుతో మత మార్పిడులు చేయటాన్ని 'లవ్ జీహాద్ లేక రోమియో జీహాద్' అని ఈ కార్యకర్తలు తెలిపారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత యోగి ఆదిత్యనాధ్ హిందూ యువవాహిని కార్యక్రమాల్లో పాలుపంచుకోవడంలేదని సమాచారం.