Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సైరా నరసింహారెడ్డి’లో అనుష్క పాత్ర ఇదేనా??

Category : movies

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి కోసం అభిమానుల ఎదురుచూపులు తప్పడం లేదు.ఏడాదికి పైగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతూనే ఉంది.చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథ కావడంతో దర్శకుడు సురేందర్ రెడ్డి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో 200 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఇప్పటికే సైరాలో అన్ని చిత్ర పరిశ్రమల నుంచి అగ్ర నటులు నటిస్తున్నారు.

అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్,విజయ్ సేతుపతి, తమన్నా,జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.గత కొన్ని రోజులుగా క్రేజీ హీరోయిన్ అనుష్క కూడా ఈ చిత్రంలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి.అనుష్క పాత్ర గురించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాలో అనుష్క కథకు కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.ఈ సినిమాలో అనుష్క వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

అసలు ఝాన్సీ లక్ష్మీబాయికి,ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు అసలు సంబంధమే లేదు.కానీ ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి "సైరా నరసింహారెడ్డి" కథను ఝాన్సీ లక్ష్మీబాయి కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారట.గతంలో "రుద్రమదేవి" సినిమాలో రుద్రమదేవిగా మెప్పించిన అనుష్క ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి‌గా దర్శనమివ్వనుంది.కొణిదెల ప్రొడక్షన్ నిర్మాణంలో రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాను ఇటు దసరా కానుకగా అటు గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.