//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గృహిణుల శ్రమ విలువ తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం

Category : state editorial

ఇంటికే పరిమితమైన ఆడవాళ్లను చాలా తక్కువగా అంచనా వేస్తారు. ఇంట్లో వాళ్ళు చేసే శ్రమను మగవాళ్ళు అస్సలు గుర్తించరు. ఇక ప్రతిదానికి ఇంట్లోనే ఉంటున్నావ్ కదా ఈ మాత్రం చేయలేరా? అంటూ చిన్న చిన్న విషయాలకు సాధింపులకు గురిచేసే మగవాళ్లు సైతం ఉన్నారు. ఇక ఇన్ని మాట్లాడుతున్న మగవాళ్లకు గృహిణుల శ్రమ విలువ అస్సలు తెలియదు. ఒక్కసారి ఆ విలువ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.గృహిణులు చేసే ఇంటి పనులు, పిల్లలను పెంచడం వంటి వాటికి ఎలాంటి వేతన చెల్లింపులు లేవు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేసే ఇంటి పని విలువ సుమారుగా 10 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని ఆక్స్‌ఫామ్‌ తెలిపింది. టర్నోవర్‌ పరంగా చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ యాపిల్‌ టర్నోవర్‌కు ఇది 43 రెట్లు ఎక్కువని పేర్కొంది.

భారత్‌లో గృహిణులు చేసే ఇంటిపని, పిల్లల సంరక్షణ విలువ జడీపీలో 3.1 శాతానికి సమానమని తెలిపింది. ఇలాంటి పనుల కోసం మహిళలు గ్రామాల్లో ఐదున్నర గంటలు, పట్టణాల్లో ఐదు గంటలు చొప్పున వెచ్చిస్తున్నారు. ఇలాంటి పనుల కోసం పురుషులు మాత్రం ఒక్క అర గంట మాత్రమే కేటాయిస్తున్నారు.

వేతన వ్యత్యాసం స్త్రీ, పురుషుల మధ్య 34 శాతంగా ఉంది. డబ్ల్యూఈఎఫ్‌ గ్లోబల్‌ జండర్‌ గ్యాప్‌ఇండెక్స్‌లో భారత ర్యాంక్‌ 108గాఉంది. 2006తో పోల్చితే ఇది పది స్థానాలు పడిపోయింది. సంపన్న భారతీయుల విషయంలో కూడా స్త్రీలు బాగానే వెనకబడి ఉన్నారు. భారత్‌లో మొత్తం 119 మంది కుబేరులుండగా, వీరిలో స్త్రీల సంఖ్య 10% కూడా లేదు. కేవలం 9 మంది సంపన్న మహిళలే ఉన్నారు. ఇప్పటికైనా గృహిణుల శ్రమ విలువను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆడవాళ్లను మరింత అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉంది.