//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ వినాయక చవితి చిత్రం ఎలా మొదలుపెట్టారో తెలుసా.....!

Category : movies

1957 లో మాయాబజార్ విడుదలైన తర్వాత అలనాటి కృష్ణభగవానుడే తమ ఎదుట నిలిచాడా అన్నంతగా ఆ పాత్ర పోషించిన ఎన్టీఆర్ కు చాలా పేరొచ్చింది. దాంతో పురాణాలలో కృష్ణుడి చుట్టూ తిరిగిన కథాంశాలతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రముఖ సినీ రచయిత సముద్రాల రాఘవాచార్య దర్శకుడిగా మారి మొదటి అవకాశాన్ని కొట్టేశారు.

అశ్వరాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై 'వినాయక చవితి' చిత్రాన్ని నిర్మించారు. పేరుకు వినాయక చవితి అని పెట్టినా సినిమా మొత్తం శ్రీకృష్ణుడే కనిపిస్తాడు. వినాయక వ్రతంలో భాగంగా మనం చదివే శ్రీ కృష్ణ - సత్రాజిత్తు - జాంబవంతుల వృత్తాంతం అంతా ఇందులో చిత్రీకరించారు.

ఘంటసాల మాస్టారి సంగీత సారథ్యంలో 24 గీతాలను ఈ చిత్రంలో పెట్టారు. వాటిల్లో 'శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం' అంటూ ఘంటసాలగారు పాడిన సాంప్రదాయ శ్లోకం బహు ప్రసిద్ధి పొందింది.

అలాగే ముత్తుస్వామి దీక్షితార్ రచన ' వాతాపి గణపతిం భజేహం... ', సముద్రాల రచించిన 'దినకరా శుభకరా దేవా, దీనాధారా తిమిర సంహార' పాటలు కూడా బహుళ ప్రాచుర్యం పొందాయి. ఘంటసాల మాస్టారు ప్రతి కచేరిలోను ఈ 'వినాయక చవితి' చిత్రంలోని శ్లోకాలను, ముఖ్యంగా 'దినకరా శుభకరా' పాటను విధిగా పాడేవారు.

#Srntr #ntr #VinayakaChavithiMovie #tollywoodmovie #telugumovie #Mayabazar