Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నాగ చైతన్యకు సమంత ఎంత కట్నం ఇచ్చింది?

Category : movies

నాగ చైతన్యను పెళ్లి చేసుకుని సమంత ఎంత కట్నం ఇచ్చింది? ఒక స్టార్ హీరోకి తనయుడు,తను కూడా హీరో,భారీ స్థాయి ఆస్తికి వారసుడు అయిన నాగ చైతన్యను సమంత ఎంతకు కొనుక్కొంది అనే డౌట్ వచ్చిందట.ఆ డౌట్ ఎవరికో కాదు సోషల్ మీడియా ద్వారా పాపులర్ గంగవ్వకు ఆ డౌట్ వచ్చింది.తమ తాజా సినిమా "ఓ బేబీ" ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గంగవ్వకు ఇంటర్వ్యూ ఇచ్చారు సమంత, నందినీ రెడ్డి.ఈ సందర్భంగా ఆమె ఆసక్తిదాయకమైన ప్రశ్నలు అడింది.

ఎంత కట్నం ఇచ్చావ్ అంటూ సమంతను అడిగింది ఆమె.ఆ ప్రశ్నకు సరదాగా సమాధానం ఇచ్చింది సమంత.చాలానే ఇచ్చా ఎంతో నీ చెవిలో చెబుతా అంటూ సమంత సరదాగా సమాధానం ఇచ్చింది.ఇక నందినీ రెడ్డి ఫ్యాంటూ షర్ట్ లో ఉండటాన్ని చూసి ఇలా ఉంటే మీ ఆయన ఏమీ అనడా అని ఆమె అడిగింది.ఏమైనా అంటాడనే పెళ్లే చేసుకోలేదు అని నందినీ రెడ్డి సమాధానం ఇచ్చింది.ఆమెకు ఎలాంటి మొగుడు కావాలో గంగవ్వ ఆరా తీసింది.నువ్వు మీ అత్తను బాగా చూసుకుంటావా,మీ అత్త నిన్ను బాగా చూసుకుంటుందా అని సమంతను ఆరా తీసింది గంగవ్వ.దానికి ఇద్దరం ఒకర్నొకరు బాగా చూసుకుంటాం అంటూ సమంత సమాధానం ఇచ్చింది!

Related News