ఉగ్రవాదంపై పోరుకు నడుం బిగించిన అమెరికా ఉగ్రవాదుల ఏరివేతకు చేస్తున్న ఖర్చు ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.
రోజుకు రూ.1600 కోట్ల చొప్పున ఇప్పటి వరకు రూ. 94 లక్షల కోట్లు ఖర్చ చేసింది. సెప్టెంబరు 11, 2001లో ట్విన్ టవర్స్‌పై జరిగిన ఉగ్రదాడి తర్వాత రంగంలోకి దిగిన అమెరికా గత పదహారేళ్లుగా రోజుకు రూ.1600 కోట్ల చొప్పున ఖర్చు చేస్తోంది. ఈ మేరకు అమెరికా డిఫెన్స్ విభాగం పేర్కొంది.
ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌లో యుద్ధానికి రూ.84 లక్షల కోట్లు ఖర్చ చేయగా ఇరాక్, సిరియాలోని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ భరతం పట్టేందుకు రూ.1.1 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు 74 పేజీలతో కూడిన డిఫెన్స్ నివేదిక పేర్కొంది.