//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత్ లో ఇంటర్నెట్ ఎంత మంది వాడుతున్నారో తెలుసా..?

ఇంటర్నెట్” సోషల్ మీడియా పుణ్యమా అని భారత్ లో దీని వాడకం రోజు రోజుకి పెరిగిపోతుంది. యుట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా సోషల్ మీడియా సైట్లు వాడకం రోజు రోజుకి పెరిగిపోతుంది. దీనితో స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు ఇలా దొరికిన సాధనంతో ఇంటర్నెట్ వాడుతున్నారు. తాజాగా దీనిపై ఒక నివేదిక విడుదల చేసారు. ఈ ఏడాది జూన్‌ నాటికి ఇంటర్నెట్ వాడుతున్నవారి సంఖ్య 50 కోట్లకు చేరుతుందని అంచనా. అయితే గ్రామీణ ప్రాంత మహిళలలో 10 మందిలో ఒకరు మాత్రమే ఇంటర్నెట్‌ వాడుతున్నారు. గ్రామాల్లో 2015లో ఇంటర్నెట్‌ వాడుతున్న పురుషులు, మహిళల నిష్పత్తి 10:1 కాగా 2017 నాటికి ఇది 10:3గా ఉంది.

ఇంటర్నెట్‌ వాడకం గురించి తెలియచెప్పి వారిని డిజిటల్‌ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు గూగుల్‌ సంస్థ ఒక భారీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. టాటా ట్రస్ట్‌ సహాయం తీసుకుని 2015లో రాజస్థాన్‌లో ఒక పైలెట్‌ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించారు. దీనికి ఇంటర్నెట్‌ సాథి అనే పేరు పెట్టారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంత మహిళలకు స్మార్ట్‌ ఫోన్‌లు, ఇంటర్నెట్‌ వాడకం, దాని ఉపయోగాలు గురించి శిక్షణ ఇస్తారు. వారు తమ గ్రామాల్లోని ఇతర మహిళలకు తమ అనుభవాలను జోడించి శిక్షణ ఇస్తారు. ఇప్పటివరకు 13రాష్ట్రాలలోని 45వేల మంది మహిళలను ఇం టర్నెట్‌ సాథిలుగా తీర్చిదిద్దగా వారు కోటిన్నర మంది మహిళలకు తిరిగి శిక్షణ ఇచ్చారు.