//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్యాకెట్ పాల‌ను మరిగిస్తే ఏమవుతుందో తెలుసుకోండి లేదంటే నష్టపోతారు!

Category : health

మనందరికీ సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించే ఆహారాల జాబితాలో మొద‌టి స్థానంలో ఉండేవి పాలు. వీటిని రోజూ సేకరించడం వ‌లన మ‌న శ‌రీరానికి చ‌క్క‌ని పోష‌ణ అందుతుంది. పిల్ల‌ల ఎదుగుదలకి పాలు ఎంతగానో తోడ్పడతాయి. అయితే పాల‌ను తాగాలంటే వాటిని ఎవ‌రైనా మ‌రిగించాల్సిందే. దాంతో పాల‌లో ఉండే హానిక‌ర‌మైన బాక్టీరియా న‌శిస్తుంది.

ఇప్పటి రోజుల్లో చాలా మంది ప్యాకెట్ పాల‌ను కూడా మ‌రిగిస్తున్నారు. నిజానికి అలా చేయటం మంచిది కాదంట. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ప్యాకెట్ పాల‌ను మ‌రిగించాల్సిన అవసరం లేదు, కొంచెం వేడి చేసుకుని ఉప‌యోగిస్తే చాలు అంటున్నారు నిపుణులు. ఈ విషయం తెలియ‌ని చాలా మంది వాటిని బాగా మ‌రిగిస్తున్నారు.

అయితే ప్యాకెట్ పాల‌ను ఎందుకు మరిగించకూడదు, మరిగిస్తే ఏమోవుతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా ఏ డెయిరీలో అయినా పాల‌ను అధిక ఉష్ణోగ్ర‌త‌కు మ‌రిగిస్తారు. 161.6 డిగ్రీల ఫారెన్‌హీట్ టెంప‌రేచ‌ర్‌కు పాల‌ను మ‌రిగించి వెంట‌నే 15 సెకండ్ల‌లోనే చ‌ల్లారుస్తారు. ఇలా చేయడాన్ని పాశ్చ‌రైజేష‌న్ అంటారు. దీని వ‌ల్ల పాల‌లో ఉండే హానికార‌క సాల్మొనెల్లా బాక్టీరియా తొల‌గిపోతుంది. అయితే ఇలా ఒక‌సారి మ‌రిగించాక ఆ పాల‌ను ప్యాక్ చేస్తారు.

కావున మ‌నం పాలను మ‌ళ్లీ మ‌రిగిస్తే వాటిల్లో ఉండే పోష‌కాలు నశిస్తాయి. కావున వాటిని మరల మరిగించాల్సిన అవసరం లేదు అంటున్నారు. కాక‌పోతే చ‌ల్ల‌గా ఉంటె కొద్దిగా వేడి చేసి తాగ‌వచ్చు. ఇక ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా గేదెల వ్యాపారుల నుంచి పాల‌ను కొనేవారు మాత్రం ఆ పాల‌ను క‌చ్చితంగా మ‌రిగించాలి. దాంతో ఆ పాలల్లో ఉండే సాల్మొనెల్లా బాక్టీరియా న‌శిస్తుంది. అప్పుడు ఆ పాల‌ను నిర‌భ్యంత‌రంగా వాడుకోవ‌చ్చు. కావున ఇక‌పై ఎవ‌రూ ప్యాకెట్ పాల‌ను మ‌రిగించ వద్దు. ఈ విష‌యాన్ని అంద‌రికీ వివరించి పాలలోని పోషకాలగురించి తెలియ‌జేయండి.