//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జ‌గ‌న్‌పై ఏపీ ప్ర‌జ‌ల్లో త‌లెత్తుతున్న ప్ర‌శ్న ఏమిటో తెలుసా..?

Category : politics

కోడిక‌త్తితో దాడి ఘ‌ట‌న‌లో ఎంత గాయం అయింది..? గాయ‌ప‌డిన వ్య‌క్తి విమానం ఎలా ఎక్కాడు..? హైద‌రాబాద్ వెళ్లిన త‌రువాత ఆ గాయం ఎంత పెద్ద‌దైంది..? ఆ స‌మ‌యంలో వేసుకున్న చొక్కా ప్ర‌స్తుతం ఎక్క‌డుంది..? పోలీసుల విచార‌ణ‌కు ఎందుకు స‌హ‌క‌రించ‌లేదు..? అన్న ప్ర‌శ్న‌ల‌పై వైసీపీ అధినేత YS Jagan సమాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఏపీ మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు పేర్కొన్నారు. Do you know AP people question to ys jagan ?

కాగా, ఇవాళ మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు మీడియాతో మాట్లాడుతూ.. Jaganపై కోడిక‌త్తితో దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి స్థాయిలో విచార‌ణ చేస్తున్న పోలీసుల చిత్త‌శుద్ధిని అనుమానించే వ్య‌క్తి రాష్ట్రంలో తిర‌గ‌డానికిగానీ, ఉండ‌టానికి గానీ అర్హుడా..? అని ప్ర‌శ్నించాడు. అస‌లు ఈ వ్య‌వ‌స్థ‌మీద‌నే న‌మ్మ‌కం లేన‌ప్పుడు నీవు భాగ‌స్వామ్యం ఎలా అవుతావ‌ని జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు మంత్రి కాల్వ శ్రీ‌నివాసులు. Do you know AP people question to ys jagan ?

సోమ‌వారం నుంచి చేసే పాద‌యాత్ర‌కు ఎవ‌రు ర‌క్ష‌ణ క‌ల్పించాలి..? ఏపీ పోలీసులే క‌దా..? పోనీ నీ ర‌క్ష‌ణ కోసం తెలంగాణ నుంచి పోలీసుల‌ను తెప్పించుకుంటావా..? లేక ఢిల్లీ నుంచి మోడీకి చెప్పి పోలీసుల‌ను తెప్పించుకుంటావా..? అంటూ జ‌గ‌న్‌పై మంత్రి కాల్వ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఇటువంటి Jagan చర్య‌లు ప్ర‌జాస్వామ్యాన్ని అవ‌మానించ‌డ‌మేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉన్న విమానాశ్ర‌యంలో జ‌రిగిన కోడిక‌త్తి ఘ‌ట‌న‌కు సంబంధించి అనుమానించే వ్య‌క్తిని క‌స్డ‌డీకి తీసుకుని విచారించాల్సిన బాధ్య‌త ఎయిర్‌పోర్టు పోలీసుల‌పై ఉంద‌ని, అటువంటిది క‌నీస ప్రాథ‌మిక సూత్రాలు పాటించ‌కుండా గాయ‌ప‌డిన జ‌గ‌న్‌ను విమానం ఎలా ఎక్కిస్తార‌న్న ప్ర‌శ్న ఇప్ప‌టికీ ఏపీ ప్ర‌జ‌ల్లో త‌లెత్తుతుంద‌ని మంత్రి కాల్వ అన్నారు.Do you know AP people question to ys jagan ?

Related News