//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మారుతి ఫ్లాష్ బ్యాక్ మీకు తెలుసా ......!

Category : movies

స్టార్ అవ్వడం అంత ఈజీ కాదు. ఆరంభంలో మామలు కష్టాలు వుండవు. ఎన్నో కష్టాలు దాటితే గానీ స్టార్ కాలెం. ఇక సినిమా కష్టాలు గురించి చెప్పక్కర్లేదు.అందరికీ కృష్ణనగర్ కష్టాలు వుంటాయి. దర్శకుడు మారుతి కూడా తన కష్టాలు గురించి చెప్పుకొచ్చారు.

మా నాన్నది అరటిపండ్ల బండి .. ఆయన చాలా కష్టాలు పడ్డాడు. నేను కూడా అరటిపండ్లు అమ్మిన రోజులున్నాయి. ఆ తరువాత ఆఫీస్ బాయ్ గా పనిచేశాను. జేబులో వున్న రెండు రూపాయలతోనే జిలేబి తిని కడుపు నింపుకున్న సందర్భాలు వున్నాయి. అదే రోడ్డులో నేను ఇప్పుడు ఖరీదైన కార్లో తిరుగుతున్నాను. నేను ఈ స్థాయికి చేరుకుంటానని నేనే ఊహించలేదు అని చెప్పుకొచ్చారు మారుతి.

ఇక నాగచైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో.. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు' సెప్టెంబర్ 13న వినాయకచవితి పర్వదినాన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది.