Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాలీవుడ్ లో A గ్రేడ్ హీరోయిన్స్ ఎవరో తెలుసా

Category : movies

ఏ సినీ ఇండస్ట్రీ లోనైనా హీరోయిన్స్ చాల ముఖ్యం . ప్రస్తుత కాలం లో హీరోయిన్స్ కూడా హీరోలకి పోటీ పడి మరి నటిస్తున్నారు . అలాగే తమ గ్లామర్ తో యువత కి పిచ్చెకిస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికొస్తే చాలామంది హీరోయిన్స్ ఉన్నారు . ప్రస్తుతం వారు నటిస్తున్న సినిమాల ఆధారంగా టాలీవుడ్ A గ్రేడ్ లో ఉన్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం .do you know A grade heroines in Tollywood ?

1 . సమంత అక్కినేని .....

సమంత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది . ఇప్పటికే దాదాపుగా తెలుగు సినీ ఇండస్ట్రీ లోని స్టార్ హీరోస్ తో కలిసి నటించింది. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ, తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది . అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది ఈమె తెలుగు తో పాటుగా తమిళం లో కూడా సినిమాలు చేస్తుంది . ఇక అక్కినేని నాగ చైతన్య ని విహహం చేసుకొని , వివాహ జీవితాన్ని కూడా ఎంతో హాయిగా సాగిస్తుంది . అలాగే ప్రస్తుతం కొన్ని సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉంది .

2 . రకుల్ ప్రీతి సింగ్ ....

రకుల్ ప్రీతి సింగ్ ప్రముఖ తెలుగు చలన చిత్ర నటి . ఈమె మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది . రకుల్ తెలుగు లో మొదటగా కెరటం సినిమా ని చేసింది . ఆ తరవాత చేసిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మంచి విజయాన్ని అందుకోవడం తో చాలా తక్కువ సమయం లోనే ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది .

3 . కీర్తి సురేష్ .......

కీర్తి సురేష్ ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈమె తెలుగులోనే కాకుండా తమిళ మలయాళం సినిమాల్లో ఎక్కువగా నటించారు కీర్తి సురేష్ నిర్మాత సురేష్ కుమార్ నటి మేనకల కుమార్తె ఈమె 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి తో హీరోయిన్ గా పరిచయమయ్యారు కీర్తి సురేష్ 2016 లో వచ్చిన నేను శైలజ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఆ తర్వాత తన నటనతో అనతికాలంలోనే ఎన్నో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించింది మహానటి సావిత్రి గారి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో సావిత్రిగారి పాత్ర చేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈ సినిమాతో అలనాటి సావిత్రి ని మరి పించింది ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది

4 . పూజ హెగ్డే

పూజ హెగ్డే మొదటగా మోడల్ గా ఉండి ఆ తర్వాత నటి గా మారింది ఈమె 2010లో ప్రపంచ సుందరి పోటీలకు భారతదేశం నుండి ఎంపిక కోసం జరిగిన అందాల పోటిల్లో రెండో స్థానంలో నిలిచింది మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ముకుందా సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయ్యింది ఈమె తెలుగు ఇండస్ట్రీ లోకి లేటుగా వచ్చినా తన హవా తో స్టార్ హీరోలైన ఎన్టీఆర్ అల్లు అర్జున్ హీరోలతో కలిసి నటించింది

5 . రష్మిక మందాన ..

రష్మిక మందాన నేటి యువత నీ ఎంతగానో ఆకట్టుకుంటున్న యువతరం హీరోయిన్ రష్మిక 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించింది చలో చిత్రంతో తెలుగు తెరపై మొదటిసారిగా కనిపించిన ఆమె నటించిన గీతాగోవిందం చిత్రం యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ వైపు అడుగులు వేస్తూ తన నటనతో ముందుకు దూసుకు పోతుంది రష్మిక మందాన రష్మిక కిరిక్ పార్టీ చిత్రీకరణ సమయంలోనే రక్షిత చేతితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత జూలై 2017 లో వీరి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది కానీ అనూహ్యమైన కారణాలతో నిచ్చితార్థం క్యాన్సిల్ అయినట్టు ఈ మధ్య ఆమె కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.

Related News