//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆస్ట్రేలియా క్రికెట్ ని మోసం చేస్తూనే ఉంటుందా ?

Category : sports

అంతర్జాతీయ క్రికెట్ లో స్మిత్ సారధ్యంలోని ఆస్ట్రేలియా ప్రత్యర్ధులను మోసం చేస్తూనే ఉందా..?” నా కెప్టెన్సీలో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడడం ఇదే తొలిసారి” అని ఆ జట్టు సారధి స్మిత్ చేసిన వ్యాఖ్యలు నిజంగా కాదా..? అంటే అవుననే సమాధాన౦ వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో ఆస్ట్రేలియా ఆటగాడు బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడుతూ కెమెరా కళ్ళకు అడ్డంగా దొరికిపోవడంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది.

ఆ తర్వాత ఫీల్డ్ అంపైర్లు అతనిని గమనించడం..పిలిచి ప్రశ్నించడంతో తన వద్ద ఏమి లేదని బుకాయించడం.. ఆ తర్వాత అది కెమెరాల్లో స్పష్టంగా కనపడటం జరిగాయి.ఆ తర్వాత మీడియా సమావేశ౦ ఏర్పాటు చేసి తాము అందరం కలిసే ఈ పని చేసామని..స్మిత్ మీడియా ముందు చెప్పడం వంటివి జరిగాయి. ఆ వెంటనే చర్యలకు దిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి..సదరు ఆటగాళ్ళపై చర్యలు తీసుకుంది. అలాగే క్రికెట్ ఆస్ట్రేలియా కూడా దీనిపై విచారణ చేపట్టింది.

అయితే బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడిన ఆటగాడు.. ప్రతిష్టాత్మక యాషెస్ సీరీస్ లో కూడా అదే పని చేసినట్టు తెలుస్తుంది. ఒక టెస్ట్ లో భాగంగా విరామ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిన అతను.. జేబులో ఏదో పోసుకుంటున్నట్టుగా కెమెరాలో చిక్కింది. అయితే అది పంచదార అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ సిరీస్‌ను ఆసీస్‌ జట్టు 4-0తో నెగ్గింది. ఈ సీసీటీవీ ఫుటేజి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. దీనిపై కూడా విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఆటగాళ్ళపై శాశ్వత నిషేధం విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Related News