Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తిరుమల వెంకన్నమీద ఎంపీ అనుచిత వ్యాఖ్యలు

Posted 13 days ago | Category : national

కలియుగ ప్రత్యక్ష దైవం..రాష్ట్రాలతో సంబంధం లేకుండా కోట్లాది మంది ఆరాధించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిపై డీఎంకే ఎంపీ కనిమొళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే వార్తలు వైరల్ గా మారాయి.

ఎంతో మంది భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కొలిచే ఏడుకొండల వాడి విషయంలో డీఎంకే ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది. ఆమె తీరుపై ఇటు సోషల్ మీడియాలో అటు పార్టీల పరంగా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. వివిధ ప్రసార మాధ్యమాల ప్రకారం `పేదవాడిని కాపాడలేని ఒక దేవుడిగా అలాంటి దేవుడు మనకి ఎందుకు?..అవసరం లేదు` అని తమిళ రాజకీయాల్లో ప్రధాన పార్టీ అయిన డీఎంకే అధినేత కరుణానిధి తనయ కనిమొళి వ్యాఖ్యానించారు.

`దేవుడి ముందు అంతా సమానమే అని నీతులు చెబుతుంటారని అయితే ఈ దేవుడు వాస్తవానికి డబ్బున్నవారే దేవుడి వద్దకు ప్రత్యేక దర్శనం ద్వారా వెలుతున్నారు. డబ్బు లేని వాళ్ళు ప్రతీ రోజు గంటలు గంటలు పడిగాపులు కాసి చూడవలసి వస్తోంది. కోట్లాది రూపాయలు ఇచ్చే కోటీశ్వరులకే ఆయన దేవుడు` అని కనిమొళి అన్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తన సొంత హుండీని కాపాడుకోలేని దేవుడు మనల్ని ఏమి కాపాడుతాడు అంటూ ఆమె వ్యాఖ్యానించినట్లు సమాచారం.

కాగా ఎంతో భక్తి విశ్వాసాలతో కొలుచుకునే కొంగు బంగారమైన వేంకటేశ్వర స్వామిపై తమిళ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు హిందువుల మనోభావాలని దెబ్బ తీసింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు అటు తమిళ ఇటు తెలుగు రాష్ట్రాలలో ప్రజలకి తీవ్ర ఆగ్రహావేశాలు కల్గిస్తున్నాయి. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా పలువురు ఆమె తీరును తీవ్రంగా ఖండించారు.

ఆమె 2జీ స్పెక్ట్రం స్కాము సహా పలు విషయాలని ఉదహరిస్తూ ఆమెని దుమ్మెత్తిపోస్తున్నారు.


మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

Posted a day ago | Category : national

మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted a day ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 2 days ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 2 days ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 3 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 3 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 4 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 6 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 6 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 8 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 8 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!