//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కావేరి ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత.. హై అలర్ట్...

Category : state

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉంది. దీంతో ఆస్పత్రికి భారీగా నేతలు, అభిమానులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. కరుణానిధి ఫోటోలు పట్టుకుని కన్నీరు పెడుతున్నారు. కోలుకుని ఆస్పత్రి నుంచి బయటకు రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి కావేరి ఆస్పత్రికి వచ్చి కరుణానిధిని పరామర్శించారు.

స్టాలిన్, కనిమొళితో మాట్లాడి కరుణ ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి బయట అభిమానులను కనిమొళి కలిశారు. కరుణానిధి త్వరగా కోలుకుంటారని, ఆయన కోసం ప్రార్థించాలని అన్నారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కూడా కరుణానిధిని పరామర్శించారు.

తమిళనాడు వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. కరుణానిధి ఆరోగ్యంపై రకరకాలు వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఎప్పిటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో రాష్ట్రమంతాట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 6 వందల మంది పోలీసులు ఆస్పత్రి వద్ద 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఆస్పత్రికి డీఎంకే కార్యకర్తలు తరలివస్తున్నారు. జులై 28న కరుణానిధి ఆరోగ్యం విషమించడంతో కావేరి ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.