//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జిల్లాల వారీగా వాలంటీర్ల వివరాలు

Category : politics

గ్రామ వాలంటీర్ల నియామకం కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.

ఈ మేరకు 11 జిల్లాల కలెక్టర్లు ప్రకటన జారీ చేశారు.

నెల్లూరు, ప్రకాశం మినహా అన్ని జిల్లాల్లో ప్రకటనలు వచ్చాయి.

11 వేల 077 పంచాయతీల్లో 1 లక్షా 56 వేల 437 వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.

సగటున ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున ప్రభుత్వం నియామకాలు చేపట్టనుంది.

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధింకాగా 1072 పంచాయతీల్లో 21 వేల 600 వాలంటీర్లను నియమించనున్నారు.

జిల్లాల వారీగా వాలంటీర్ల వివరాలు:

పశ్చిమగోదావరి జిల్లా - 17,881

శ్రీకాకుళం - 11,924

విజయనగరం - 10,012

విశాఖ జిల్లా – 12, 272

గుంటూరు - 17, 550

కృష్ణా - 14 వేలు

అనంతపురం - 14, 007

చిత్తూరు - 15, 824

కర్నూలు - 12, 045

కడప - 9, 322

రేపటి నుంచి (జూన్ 24 సోమవారం) జులై 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు.

అభ్యర్థులు gramavolunteer.ap.gov.inవెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఎంపికైన వారికి శిక్షణానంతరం ఆగస్టు 15 నుంచి బాధ్యతలు అప్పగించనున్నారు.