Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెగించిన ప్రేమోన్మాది...యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి.!

Posted 3 months ago | Category : national

మరో ప్రేమోన్మాది బరితెగించాడు. తనతో మాట్లాడటం లేదన్న కారణంతో ప్రేమించిన యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఇటీవలే తమ ప్రేమ గురించి పెద్దలకు తెలపగా వీరికి నిరాశే ఎదురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా యువకుడితో ఆమె మాట్లాడటం లేదు. దీంతో యువతిపై కక్ష పెంచుకున్న యువకుడు నేరుగా ఆమె గదికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

ఒడిశా రాష్ట్రంలోని భద్రాక్‌ జిల్లా బగానా గ్రామానికి చెందిన కమల కాంత్‌ నాయక్‌ (23), అదే జిల్లాలోని సుందర్‌పూర్‌ గ్రామానికి చెందిన రింకీరాణి (20) బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలోని ఓ స్పిన్నింగ్‌ మిల్లులో పనిచేస్తున్నారు.కంపెనీ క్వార్టర్స్ లోనే నివాసముంటున్నారు. రెండేళ్ల నుంచి ఒకే స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తుండటం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. పైగా ఇద్దరిది ఒకే ప్రాంతం, ఒకే కులం కావడంతో.. పెద్దలు సైతం తమ ప్రేమను ఒప్పుకుంటున్నారని భావించారు.

తమ ప్రేమకు పెద్దల అంగీకారం లభిస్తుందనుకున్న నాయక్, రింకీరాణిలకు ఊహించని పరిస్థితి ఎదురైంది. 15 రోజుల క్రితం రింకీరాణి స్వగ్రామానికి వెళ్లిన సందర్భంగా కమల కాంత్‌ నాయక్‌ కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధంపై మాట్లాడారు. అయితే పెళ్లిపై ఇరు కుటుంబాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వీరికి నిరాశ ఎదురైంది. ఇరు కుటుంబాల్లో పెళ్లిపై బేధాభిప్రాయాలు వచ్చిన తర్వాత.. నాయక్ తో రాణి మాట్లాడటం మానేసింది. దీంతో ఆమెపై నాయక్ కక్ష పెంచుకున్నాడు. ఆగ్రహంతో రగిలిపోతూ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో కంపెనీ క్వార్టర్స్ లోని రాణి గదికి వెళ్లాడు. ఆ సమయంలో రాణి స్నేహితులతో ఉండగా.. నీతో మాట్లాడాలని నాయక్ అన్నాడు.

అయితే రాణి మాత్రం అందుకు నిరాకరించడంతో అకస్మాత్తుగా కత్తితో ఆమెపై దాడి చేశాడు. దాడిలో రింకీరాణి మెడ, నడుం భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ వైద్యశాలకు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసినట్లు వీరవల్లి ఎస్‌ఐ నాగ దుర్గారావు తెలిపారు. ప్రస్తుతం నాయక్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి