//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్లూవేల్ ఆన్‌లైన్ లింక్ తొలగించాలని ఆదేశం

Category : national


ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బ్లూవేల్ ఆన్‌లైన్ గేమ్ బారిన పడి యువకులు, విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ లింక్ తక్షణమే తొలగించాలని కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ, ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లకు నోటిసులు అందజేసింది. మరణ వినాశకమైన ఈ ఆన్ లైన్ ఆట వలన దేశంలో పలువురు విద్యార్థులు మృతవ్యు ఒడిలో పడుతున్నందున ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నది. ఈ ఆట  ఆడటానికి 50 రోజుల వ్యవధి ఇస్తారు. చివరకు ఆత్మహత్యకు పురికొల్పడం జరుగుతున్నది. ఈ లోగా తమ ఫోటోలను ఆన్ లైన్ లో షేర్  చేసేటట్లు  చేస్తారు.

మూడు రోజులక్రితం పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఇద్దరు విద్యార్థులు బ్లూవేల్ గేమ్ ఆడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా సహచరులు, పోలీసులు వారిని కాపాడారు. గత నెల ముంబైకి చెందిన తొమ్మిదోతరగతి విద్యార్థి ఎత్తైన భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో బ్లూవేల్ అరాచకం భారత్‌లో వెలుగులోకి వచ్చింది.