//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'పంతం తీర్చుకున్న సుకుమార్' ...ఇద్దరి లెక్కలు తేల్చిన మహేష్ బాబు

Category : movies

'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత దర్శకుడు సుకుమార్ ఎలాంటి సినిమా ,ఏ హీరోతో చేస్తాడు అన్న ప్రశ్న అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలోనే సుక్కు తన తదుపరి సినిమాను మహేశ్ తో చేయాలనే ఉద్దేశంతో ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. అయితే ఆ కథ మహేశ్ బాబుకు అంతగా నచ్చకపోవడంతో . మరో కథను తయారు చేయడానికి సుకుమార్ కొంత సమయాన్ని తీసుకున్నాడు. ఈ సమయంలోనే 'ఎఫ్ -2' సినిమాతో క్రేజీ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి సిన్ లోకి ఎంటర్ అయ్యాడు.

ఈ కాస్త గ్యాప్ లోనే అనిల్, మహేశ్ బాబు కి కథ మొత్తం చెప్పి డేట్స్ తీసుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లో ఆయన బిజీగా ఉన్నాడు .కానీ ముందుగా సుకుమార్ కి కమిట్ అయినా మహేష్, అనిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో కాస్త కలత చెందిన సుకుమార్.ఎలాగైనా మహేష్ తో సినిమా పట్టాలెక్కించాలనే ఆలోచనతో నిన్న మహేశ్ బాబును కలిసి సుకుమార్ ఒక లైన్ చెప్పాడట.

ఆ లైన్ కాస్త మహేష్ కి బాగా నచ్చేసిందట .. దాంతో పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేయమని అన్నాడని సమాచారం. ఇంతవరకూ తానెప్పుడూ రెండు సినిమాలను సమాంతరంగా చేయలేదనీ, వీలైతే అనిల్ రావిపూడి సినిమాతో పాటు .. ఈ సినిమా కూడా చేసేస్తానని మహేశ్ బాబు అన్నాడట. దీనితో ఊపిరి పీల్చుకున్నాడు సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇలా మహేష్ చెప్పిన మాటతో మైత్రీమూవీస్ కు, దర్శకుడు సుకుమార్ కు ఓ భారం తీరిపోయింది.. అనిల్ రావిపూడి సినిమాను నిర్మాత దిల్ రాజు- అనిల్ సుంకర కలిసి నిర్మిస్తారు. ఈ సినిమానే ముందుగా ప్రారంభం అవుతుంది. ఆ తరువాత వీలును, అవకాశాన్ని బట్టి సుకుమార్ సినిమాకు డేట్లు కేటాయిస్తారు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక , రాజమౌళి-కేఎల్ నారాయణ సినిమా మీదకు వెళ్లాలన్నది మహేష్ బాబు ప్లాన్.చూడాలి మరి అనిల్,సుకుమార్ సినిమాల్లో ఏ సినిమా మహేష్ కి హిట్ అందిస్తుంది, అన్నది.