//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శంషాబాద్ నుండి నేరుగా వాషింగ్టన్ కు విమానం

Category : business

జీఎంఆర్ హైదరాబాద్(శంషాబాద్) ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుండి అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శనివారం నూతనంగా విమానాలు ప్రారంభించారు. ఎయిర్‌ఇండియా ఎయిర్‌లైన్స్ విమానం-104 ఢిల్లీ మీదుగా బయలుదేరింది. ఇక నుంచి వారంలో మూడు విమానసర్వీసులను వయా ఢిల్లీ మీదుగా రెండు దేశాల మధ్య నడుపనున్నారు. 

యూఎస్‌లోని అతి పెద్ద సిటీతో హైదరాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అనుసంధాన నగరాల్లో ఇది రెండోది. మొదటిది చికాగో. అంతర్జాతీయ మార్కెట్ రంగంలో కీలకప్రదేశం యూఎస్‌కు ఏటా హైదరాబాద్ నుంచి 675,000 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. 

ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిశోర్ మాట్లాడుతూ హైదరాబాద్-వాషింగ్టన్ విమానాల సర్వీసుల ప్రారంభం మధ్య, దక్షిణభారత దేశానికి, వాషింగ్టన్ మధ్య అన్ని విధాల సంబంధాలు పెరుగుతాయని తెలిపారు. గతంలో ఢిల్లీ, ఇతర నగరాలకు వెళ్లి వాషింగ్టన్ వెళ్లాల్సి వచ్చేదన్నారు. 

ఇమ్మిగ్రేషన్, బ్యాగేజ్ చెకింగ్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు. త్వరలో శ్రీలంకకు కూడా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ప్రస్తుత కనక్టింగ్‌తో వాషింగ్టన్‌తోపాటు సాన్‌ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, సియోల్, న్యూయార్కుకు వెళ్లివచ్చేవారికి మంచి అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు నుంచి 17 ఇంటర్నేషనల్, 35 డొమెస్టిక్ కనెక్టింగ్ ఉన్నట్టు సీఈవో వివరించారు.