//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చాన్నాళ్ళ తర్వాత టెస్ట్ ఆడనున్న కీపర్

Category : sports

గత కొంత కాలంగా అద్భుత ఫాం తో దూసుకుపోతున్న టీం ఇండియా ఆటగాడు దినేష్ కార్తీక్ భారత జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నాడు. ముఖ్యంగా టెస్ట్ జట్టులో స్థానం కోసం దేశవాళి మ్యాచుల్లో సత్తా చాటుతున్నాడు. ఎట్టకేలకు అతని ప్రయత్నాలు ఫలించాయి. టీం ఇండియాలో స్థానం దక్కే అవకాశాలు కనపడుతున్నాయి.

టెస్టు జట్టుకు వికెట్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వహించే వృద్ధిమాన్‌ సాహా చేతి వేలికి గాయం కావడంతో వైద్యులు ఆరు వారాల పాటు విశ్రాంతి సూచించారు. దీనితో అఫ్గాన్‌తో జరిగబోయే చరిత్రాత్మక టెస్టుకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో దినేష్ కార్తీక్ ని టెస్ట్ జట్టులోకి తీసుకోవాలని బోర్డ్ భావిస్తుంది. సాహా స్థానంలో దినేశ్‌ కార్తీక్‌కు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ అనుకుంటున్నట్లు సమాచారం.

అలాగే ఆ తర్వాత ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లే భారత టెస్టు జట్టులోనూ దినేశ్‌ కార్తీక్‌కు అవకాశం కల్పించాలనుకుంటున్నట్లు సెలక్షన్‌ కమిటీ భావిస్తోందట. ఎందుకంటే 2007లో ఇంగ్లాండ్‌ పర్యటనలో కార్తీక్‌ మూడు అర్ధశతకాలు సాధించాడు. ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకునే కార్తీక్‌ను ఎంపిక చేయాలనుకుంటుందట. కార్తీక్‌ చివరి సారి 2010లో టెస్టు ఆడాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు సాహాకు గాయం కావడంతో దినేశ్‌ కార్తీక్‌ పేరు తెరపైకి వచ్చింది. మరి దినేష్ కార్తిక్ ని తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.