//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ బంతిని నేనెప్పటికీ మర్చిపోలేను

Category : sports

ఓటమి అంచుల్లో ఉన్న జట్టుని తన దూకుడైన ఆట తీరుతో గెలిపించి బంగ్లాదేశ్ తో జరిగిన ముక్కోణపు టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియాకి చారిత్రాత్మక విజయాన్ని అందించాడు వెటరన్ ఆటగాడు దినేష్ కార్తిక్. గెలిచే అవకాశాలు లేవు అనుకుంటున్న తరుణంలో బ్యాటింగ్ కి దిగిన కార్తీక్ సిక్సులు , ఫోర్లతో హోరేత్తించాడు. అప్పటి వరకు ముఖం చాటేసిన విజయం ఒక్కసారిగా భారత్ వైపు చూసింది.

గత కొన్నేళ్లుగా టీంలో సుస్థిర స్థానం ఆశిస్తున్న దినేష్ కార్తిక్ కి ఈ ఇన్నింగ్స్ అయినా జట్టులో చోటు కల్పిస్తుందని భావిస్తున్నారు అభిమానులు. ఇది ఇలా ఉంటె తాను సిక్స్ కొట్టిన ఆఖరి బంతిని తాను ఎప్పుడు మర్చిపోలేనని కార్తిక్ చెప్పుకొచ్చాడు. ‘‘ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి విషయాలు జీవితాంతం గుర్తిండిపోతాయి. చాలా సంతోషంగా ఉంది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్న. ముఖ్యంగా చివరి ఓవర్ ఆఖరి బంతిని నేను ఎప్పటికీ మర్చిపోను’’ అని కార్తిక్ తన విజయానందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

ఇదిలా ఉంటె కార్తిక్ కి మాజీల నుంచి మద్దతు పెరుగుతుంది. దేశవాళిలో సత్తా చాటిన కార్తిక్ ని తుది జట్టులోకి రెగ్యులర్ గా తీసుకోవాలని అతను 5 నుంచి 7వ స్థానం వరకు బ్యాటింగ్ చెయ్యడంలో సమర్ధుడని.. భారత్ మిడిల్ ఆర్డర్ ప్రస్తుతం ఆశించిన స్థాయిలో లేదని కాబట్టి కార్తిక్ ని తుది జట్టులోకి తీసుకుని ఆ లోటుని భర్తీ చెయ్యాలని మాజీలు కోరుతున్నాడు. కాగా దినేష్ కార్తీక్ మాజీ సారధి కంటే మూడు నెలలు ముందుగానే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

Related News