//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రోహిత్ ని నిరాశ పరిచిన కార్తిక్.. కాని

Category : sports

12 బంతుల్లో 34 పరుగులు అంటే పెద్ద కష్టమేమి కాదు. ఎందుకంటే అది పొట్టి ఫార్మాట్. నిలకడగా ఆడటానికి ప్రాధాన్యత లేకపోవడంతో ఎలాంటి షాట్ అయినా స్వేచ్చగా ఆడవచ్చు. ఎలా ఆడినా గెలుపే లక్ష్యంగా ఆడాలి. లేకపోతే విమర్శలు తప్పవు. కాని తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న తమిళ నాడు ఆటగాడు విజయ్ శంకర్ తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. కీలకమైన 18వ ఓవర్లో నాలుగు బంతులు వృదా చేసాడు.

దీనితో విజయం మరింత దూరం జరిగింది. 5వ బంతికి సింగిల్ తీసి పాండే కి బ్యాటింగ్ ఇచ్చినా అతడు క్యాచ్ అవుట్ గా పెవీలియన్ చేరాడు. ఇక రెండు ఓవర్లు మాత్రమె మిగిలి ఉన్నాయి. ఈ దశలో భారత్ గెలుస్తుందని ఎవరు ఊహించలేదు కూడా. ఈ సమయంలో బ్యాటింగ్ కి వచ్చిన టీం ఇండియా వెటరన్ ఆటగాడు.. దినేష్ కార్తిక్ వచ్చి రావడంతోనే చెలరేగిపోయాడు. తొలి మూడు బంతుల్లో 16 పరుగులు చేసాడు.

దీనితో ఒక్కసారిగా స్టేడియం లో సంబరాలు ఆకాశాన్ని అంటాయి. మళ్ళి విజయ్ శంకర్ బ్యాటింగ్.. అసలు దినేష్ సింగల్ ఎందుకు తీసాడు అనుకున్నారు. కాని విజయ్ శంకర్ ఫోర్ కొట్టి ఆ వెంటనే క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు. ఈ సమయంలో ఒక్క బంతికి 5 పరుగులు చెయ్యాలి. దినేష్ కార్తిక్ క్రీజ్ లో ఉండటంతో అది పెద్ద కష్టం కాదనుకున్నా అందరిలో ఏదో భయం ఆ భయాన్ని తొలగిస్తూ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి విజయాన్ని అందించాడు.

అయితే ఈ తరుణంలో సారధి రోహిత్ శర్మ మాత్రం కాస్త షాక్ అయ్యాడట. మ్యాచ్ టై అవుతుందని భావించాడట.ఈ విషయాన్నీ రోహిత్ ఏ వెల్లడించాడు. చివరి ఓవర్లో ఆఖరి రెండు బంతుల్లో ఐదు పరుగులు చేయాలి. ఐదో బంతికి శంకర్‌ ఔటయ్యాడు. అప్పటికి మా జట్టు స్కోరు 162. ఇక మిగిలింది ఒకటే బంతి. స్ట్రైకింగ్‌లో కార్తీక్‌ ఉన్నాడు. ఎలాగైనా ఫోర్‌ కొడతాడు.. దీంతో మ్యాచ్‌ డ్రా అవుతుంది. సూపర్‌ ఓవర్‌ ద్వారానే ఫలితం దక్కుతుంది అని భావించి డ్రస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి ప్యాడ్ కట్టుకుంటున్నాను. ఆ సమయంలోనే కార్తీక్‌ సిక్స్‌ బాదేసి భారత్‌కు విజయం ఖరారు చేసేశాడు. డ్రస్సింగ్‌ రూమ్‌లోనే ఉన్న నేను ఆ సిక్స్‌ను చూడలేకపోయానని చెప్పాడు.

Related News