//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దినకరన్‌ అరెస్టు

Category : national state

రెండాకుల గుర్తు కోసం ఈసీ అధికారికి లంచం ఇవ్వజూపిన కేసులో అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్‌ను దిల్లీ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. కేసు విచారణలో భాగంగా నాలుగు రోజులపాటు ప్రశ్నించిన అనంతరం ఆయన్ను అరెస్టు చేశారు. దినకరన్‌ స్నేహితుడు మల్లికార్జునను కూడా అరెస్టు చేశారు. ఆయన్ను రెండు రోజులపాటు ప్రశ్నించారు. కేసులో మరో నిందితుడైన బ్రోకర్‌ సుకేశ్‌ చంద్రశేఖర్‌ను తాను కలిశాను,కానీ అతడికి ఎలాంటి డబ్బూ ఇవ్వలేదని విచారణలో దినకరన్‌ తెలిపాడు అని పోలీసు వర్గాలు తెలిపాయి.

Related News