//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోట్లు ఉన్నా ఇటువంటి మనసు ఎవరికీ ఉంటుంది

Category : editorial

ఇళ్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు అంటారు మన పెద్దలు. అంటే ఆ రెండు పనులు అంత కష్టం అని అర్థం. పేద కుటుంబాలకు ఆ కష్టం లేకుండా చేయడానికి తానే పెళ్లి పెద్దగా మారారు ఆయన. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా వందలాది జంటలను ఒకటి చేశారు.

కుబేరుల పెళ్లి వేడుకలకు ఏమాత్రం తీసిపోకుండా అంబరాన్నంటిన సంబరాలివి. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి మహేశ్ సవానీ.. పేద కుటుంబాలకు పెద్దగా మారి.. 251 జంటలను ఒకటిగా చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో లక్ష మందికిపైగా అతిథులు పాల్గొన్నారు. కోట్ల రూపాయల ఖర్చు చేసి మరీ ఈ సామూహిక వివాహాలు జరిపించారు.

పెళ్లి కానుకగా ఖరీదైన నగలు, బహుమతులు అందించారు. ఆయన వివాహం జరిపించిన వాటిలో ఐదు ముస్లిం జంటలు, ఒక క్రైస్తవ జంట ఉంది. హిందువులకు వైదిక సంప్రదాయం ప్రకారం.. మిగిలిన వారికి ఆయా సంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్లు జరిపించారు. ప్రతిఏటా వందల జంటలను మహేశ్ సవాని ఒకటి చేస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు వెయ్యి జంటలకు వివాహం జరిపించారు.

2008లో తనదగ్గర పనిచేస్తున్న ఒక ఉద్యోగి చనిపోయాడు. మరికొద్ది రోజుల్లో ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేయాల్సి ఉండగా ఆ ఘటన జరిగింది. దాంతో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు మహేశ్ సవానీ పెళ్లి పెద్దగా మారారు. అప్పటి నుంచి ప్రతిఏటా ఎంతోమంది అనాథ యువతులకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వివాహాలు జరిపిస్తున్నారు.