Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పక్కవాల్ల కథ తో సినిమా తీసి హిట్ కొడుతున్న దిల్ రాజు

Category : movies

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మాతగా, సంతోషం డైరెక్టర్ దశరధ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా 2011 ఏప్రిల్ 21 న విడుదల అయిన Mr.perfect సినిమా ఫామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. అసలు ఈ సినిమా కథ నాదే అంటూ ప్రముఖ నవల రచయిత ముమ్మిడి శ్యామలరాణి నిర్మాత దిల్ రాజు ని కలవడానికి ప్రయత్నం చేసారు , అయితే ఆయనగారు నాకు సంబంధం లేదు వెళ్లి దర్శకుడిని కలవండి అని తప్పించుకున్నారు, అవును నిజానికి సినిమా కథకి నిర్మాతకు సంబంధం ఉండదు, కానీ ఇక్కడ విషయం ఏమిటంటే Mr.perfect సినిమా టైటిల్స్ లో మూల కథ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అని పడుతుంది. మరి దాని ప్రకారం అసలు కథ ఎవరితో దిల్ రాజుకు తెలియకుండా ఎలా ఉంటుంది. ఈ విషయాన్నీ వివరిస్తూ ముమ్మిడి శ్యామలరాణి నేను రాసిన నా మనసు కోరింది నిన్నే అనే నవల ఆధారంగా నాకు తెలియచేయకుండా సినిమా తీసేసారు. సినిమా విడుదల అయిన టైంలో నేను అమెరికాలో ఉన్నాను వచ్చిన తరువాత నా నవల ఆధారంగా సేమ్ కథను చిత్రంగా మలిచారు అని బంధువులు తెలియజేసారు . ఈ విషయం పై తగిన ఆధారాలతో కోర్ట్ ను ఆశ్రమించాను, ఇప్పుడు కోర్ట్ కూడా అన్ని పరిశీలించి కథ నాడే అని తీర్పునిచ్చింది, అని ధైర్యంగా మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు . మరి ఈ విషయం పై అటు నిర్మాతగాని, డైరెక్టర్ కానీ ఏం స్పందించడం లేదు. మరి తప్పు ఒప్పుకుని రాజీ పడతారో లేక తప్పించుకుని తిరుగుతారో చుడాలిమరి .

Related News