//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"పేట" తెలుగు నిర్మాతపై.... మరో నిర్మాత "దిల్ రాజు" ఫైర్

Category : movies

ఈ సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఉన్నవాటి కే సినిమా హాల్స్ దొరకని ఈ పరిస్థితుల్లో ఆ చిత్ర నిర్మాత లకు ఒక్కింతా నష్టం జరిగే అవకాశమే అధికంగా ఉండడం గమనార్హం. సంక్రాంతి అనగానే ఆ పండుగకు ఎంత క్రేజ్ ఉంటుందో ఆ సమయంలో రిలీజ్ అయ్యే సినిమాలకు అంతే స్థాయిలో అంచనాలు ఉండడం విశేషం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సంక్రాంతిలో రిలీజ్ అయ్యే సినిమాల విడుదలపై తెలుగు సినీ నిర్మాతల్లో వివాదం చెలరేగింది. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ‘పేట’ చిత్రానికి థియేటర్లు దొరకడంలేదంటూ ఆ సినిమా తెలుగు నిర్మాత అశోక్‌ వల్లభనేని ‘పేట’ ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై స్పందించిన ...

మరో ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్‌రాజు సోమవారం స్పందించారు. ఈ సంక్రాంతికి మూడు పెద్ద తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయని తెలిసి కూడా,ఒక తమిళ అనువాద చిత్రానికి ఎలా థియేటర్లు దొరుకుతాయని ఆయన ముక్కు సూటిగా ప్రశ్నించారు. మూడు తెలుగు సినిమాలకే థియేటర్లు సరిపోని పరిస్థితి ఉన్న ఈ తరుణంలో.... ఇంకో వారం తరువాత నుంచి థియేటర్లలో పేట మూవీ మాత్రమే ఉంటుందని అశోక్‌ అన్నారని...అయితే మరి ఆ రోజే ‘పేట’ చిత్రం విడుదల చేసుకోవచ్చు కదా? అని దిల్‌రాజు చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ తానే పంపిణీదారుడిగా చాలా డబ్బులు పోగొట్టుకున్నానన్నారు. తెలుగు సినిమాల విడుదల తేదీ 6 నెలల ముందే ప్రకటించామని, అశోక్‌ వల్లభనేని అనుచితంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు అని ఆయన తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు.

అయితే ఈ సంక్రాంతికి మన తెలుగులో యన్‌.టి.ఆర్‌ బయోపిక్ 'కథానాయకుడు', ‘వినయ విధేయ రామ’, ‘f2’ (ఫన్ అండ్ ప్రెస్టేషన్) వంటి తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇపుడు ఉన్న ఈ మూడు సినిమాలకె,సినిమా హాల్స్ దొరికే అవకాశం లేకున్నా, వాటిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి అని. . బాలకృష్ణ, రామ్‌చరణ్‌, వెంకటేశ్‌,వరుణ్‌తేజ్‌ వంటి స్టార్స్ నటించిన సినిమాలు కావడంతో థియేటర్లకు డిమాండ్‌ పెరిగింది. మరోపక్క ఇదే సమయంలో రజనీకాంత్‌ నటించిన ‘పేట’ కూడా విడుదల కాబోతోంది. చూడాలి మరి ఈ సంక్రాంతి బరిలో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది.