//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇంటర్నెట్‌లో సందేశాలు, ఫొటోలు కాదు నీళ్లు కూడా పంపొచ్చు..

Category : world

ఇప్పటి దాకా సందేశాలు, ఫొటోలు, ఇతర వివరాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఇంటర్నెట్ ద్వారా పంపించేవాళ్లం. ఇప్పుడు కాక్‌టెయిల్స్‌ని సైతం ఎలక్ట్రానిక్ టంబ్లర్ల ద్వారా ఇతరుకులకు ఇంటర్నెట్ సహాయంతో పంపించే సన్నాహాలు జరుగుతున్నాయి.దాహం వేసినపుడు చుట్టు పక్కల నీటి సౌకర్యం కనిపించకపోతే అలాంటి పరిస్థితిలో దప్పికతో అలమటించాల్సిందే! కానీ ఆ నీళ్లు దొరకని ప్రదేశంలో కూడా ఒక మగ్, ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తే మీ పంట పండినట్టే అంటున్నారు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ శాస్త్రవేత్తలు. వీళ్లు ఒక డిజిటల్ టంబ్లర్‌ని తయారు చేశారు. ఈ స్పెషల్ మగ్‌లో నీళ్లు నింపి ఇతరులకు విద్యుత్ ప్రేరణ ద్వారా పంపించే వెసులుబాటు చేస్తున్నారు.

అయితే వారి దగ్గర కూడా ఇలాంటి మగ్ ఉండి తీరాల్సిందే! ఈ నీరు రాగానే అందులో ఉండే ఎల్‌ఈడీ లైట్లు వెలుగుతాయి. అప్పుడు మామూలు నీరు కాస్త నిమ్మకాయ నీళ్ల రుచిలోకి మారుతుందట. ఈ ఒక్క టేస్ట్ ఉన్న నీళ్లే కాదు.. డిఫరెంట్ ఫ్లేవర్లు ఉన్న మాక్‌టెయిల్స్, కాక్‌టెయిల్స్‌ని కూడా పంపించేలా ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నీళ్ల వ్యవహారం పూర్తిగా ఒక కొలిక్కి వస్తే త్వరలోనే ఇతర డ్రింక్స్ పంపించేలా ఏర్పాటు చేస్తానంటున్నారు శాస్త్రవేత్తలు. అదే గనుక జరిగితే మరో కొత్త అధ్యయానికి ఈ శాస్త్రవేత్తలు తెరలేపినట్టే!