//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రూ. 2.20 లక్షల కోట్లకు చేరుకోనున్న డిజిటల్ కామర్స్

Category : business

దేశవ్యాప్తంగా డిజిటల్ కామర్స్ మార్కెట్ భారీగా పుంజుకుంటున్నది. ఈ ఏడాది చివరి నాటికి డిజిటల్ కామర్స్ మార్కెట్ రూ. 2,20,330 కోట్లకు చేరుకోనున్నదని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఐఎంఆర్‌బీ కాంతర్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

డిసెంబర్ 2016తో ముగిసిన ఏడాదికాలంలో నమోదైన రూ.1,68,891 కోట్లతో పోలిస్తే 30 శాతం వృద్ధిని నమోదు చేసుకోనున్నది. దేశీయ డిజిటల్ కామర్స్ మార్కెట్లో సగం వాటా కలిగిన ఆన్‌లైన్ ట్రావెల్ మార్కెట్ కూడా డిసెంబర్ 2017 నాటికి రూ.1,18,598 కోట్లకు చేరుకోనున్నది.
అంతక్రితం ఏడాది నమోదైన రూ.95,198 కోట్లతో పోలిస్తే 24 శాతం ఎగబాకనున్నది. ఈ-టైలింగ్ సెగ్మెంట్ రూ.94,064 కోట్లకు ఎగబాకనున్నదని అంచనా.

ఇలా ఉండగా,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం 8-10 శాతం మధ్యలో మాత్రమే వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉందని నాస్కామ్ మాజీ చైర్మన్, సైయెంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. 

ఉద్యోగ నియామకాల్లో నిరాశ తప్పదని, గతేడాది నియమించుకున్న వారితో పోలిస్తే ఈ ఏడాది 25 శాతం వరకు తగ్గవచ్చునని ఆయన అంచనా వేస్తున్నారు. వచ్చే మార్చి నాటికి ఐటీ రంగంలో 1.50-1.80 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. గడిచిన సంవత్సరంలో 2 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి.