//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పిల్లలకు విచిత్ర పేర్లుతో నామకరణం

Category : national

ఇప్పుడు ఉన్న సమాజంలో మీకు పుట్టిన పిల్లల పేర్లు ఏమి పెడతారు, ఎ మహేష్ అనో నిఖిల్ అనో పెడతారు కదా, అలా కాకుండా మీ పిల్లల పేర్లు 'రాష్ట్రపతి','ప్రధానమంత్రి', 'హైకోర్టు', 'కలెక్టర్', వంటి వింత పేర్లు పెడతారా..? లేదు కదా! కాని ఇలాంటి పేర్లు పెడుతున్న గ్రామస్తులు ఉన్నారంటే నమ్ముతారా? నమ్మాలి మరి, 'ప్రధానమంత్రి', 'హైకోర్టు', ఈ పేర్లన్నీ రాజస్థాన్ లో ఒక గ్రామానికి చెందిన వారివి. ఇంతకి ఈ పేర్లు వెనకున్న కధేంటంటే.

రాజస్థాన్ లో రాంనగర్ పేరిట ఓ చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో సుమారు 500 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ గ్రామంలో పుట్టిన పిల్లలందరికీ బిన్నంగా 'శాంసంగ్', 'కలెక్టర్', 'హైకోర్టు', 'సిమ్ కార్డు', 'చిప్', వంటి విచిత్రమైన పేర్లతో నామకరణం చేస్తుంటారు. వీరి పేర్లు చూసి వాటికి తగ్గటే చదువులుంటాయని మాత్రం అనుకుంటే పప్పులో కాలేసినట్టే, ఆ గ్రామంలో ఎ ఒక్కరికి సరైన చదువు లేదు. చిన్న చితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అసలు ఈ పేర్లను ఎలా పెట్టారంటే కొన్నేళ్ల క్రితం ఆ జిల్లా కలెక్టర్ ఈ రాంనగర్ గ్రామాన్ని సందర్శించాడు. అప్పుడు ఆ కలెక్టర్ చేసిన అభివృద్ధి పనులు నచ్చి అదే గ్రామానికి చెందిన ఓ మహిళ తన మనవడికి 'కలెక్టర్' అని పేరు నామకరణం చేసింది. ఇప్పుడు ఆమె మనవడికి 50 ఏళ్ళు, ఇప్పటి వరకు ఆ కలెక్టర్ స్కూల్ కి వెళ్ళింది లేదు, అక్షరాలు నేర్చుకుంది లేదు, అంతే కాదండి ఒక్కోసారి వ్యక్తిగత సమస్యల వల్ల గ్రామస్తులు పోలీస్ స్టేషన్లు, కోర్టులు చుట్టు తిరుగుతుంటారు. అప్పుడు పోలీసులుకు, న్యాయవాదులకు ఇచ్చే మర్యాదలు చూసి వాళ్ళ పిల్లలకి 'ఐజీ', 'ఎస్పీ', వంటి వింత పేర్లు పెడుతున్నారని అక్కడ పని చేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి చెపుతున్నాడు.

అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పుట్టుకతోనే అవిటివాడు. అతను పుట్టినప్పుడు అతని తాతయ్యకి ఓ కేసు విషయంలో హైకోర్ట్ నుంచి బెయిల్ వచ్చిందంట, దాంతో అతనికి 'హైకోర్టు' అని పేరు పెట్టేశారు. ఈ గ్రామానికి బదిలీపై వచ్చే అధికారులు వారి వింత పేర్లు విని షాకయ్యేవారట. ఆ తర్వాత నిదానంగా వారికి, వారి విచిత్ర పేర్లకి అలవాటు పడుతున్నామంటూ అక్కడికి బదిలీపై వస్తున్న ప్రభుత్వ అదికారులు చెపుతున్నారు.