డీజిల్ కారు కొంటే ఇకపై 2 శాతం అదనపు పన్ను చెల్లించాల్సిందే. ఈ మేరకు ప్రభుత్వానికి రవాణా శాఖ ప్రతిపాదనలు పంపింది. ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించనుంది. ప్రస్తుతం రూ.10 లక్షల లోపు ధర ఉన్న డీజిల్ కారుకు 12 శాతం పన్ను విధిస్తుండగా.. ఇకపై అది 14 శాతానికి పెరుగుతుంది. అదే రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ ధర ఉన్న డీజిల్ కార్లపై పన్ను 16 శాతంగా ఉండనుంది. ప్రస్తుతం తెలంగాణలో అమ్ముడవుతున్న డీజిల్ కార్ల సంఖ్య ఆధారంగా బేరీజు వేసుకుంటే ప్రభుత్వానికి ఈ అదనపు పన్ను రూపంలో కనిష్టంగా ఏడాదికి రూ.130 కోట్ల ఆదాయం సమకూరనుంది.