Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డిసెంబ‌ర్ 11న కేటీఆర్ ఏం చేయ‌బోతున్నాడో తెలుసా..?

Category : politics

ఏపీ ఆక్టోప‌స్‌గా పేరొందిన మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మంగ‌ళ‌వారం సాయంత్రం తెలంగాణ రాజ‌కీయ పార్టీల‌పై త‌న టీమ్‌తో చేయించిన స‌ర్వే వివ‌రాల‌ను వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ సర్వే వివ‌రాల‌నే ల‌గ‌డ‌పాటిని కొన్ని పార్టీల‌కు మిత్రునిగా.. మరికొన్ని పార్టీల‌కు శ‌త్రువుగా మారేలా చేశాయి. ఈ స‌ర్వేతో మ‌హాకూట‌మి శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతుండ‌గా.. తెరాస శ్రేణులు మాత్రం ల‌గ‌డ‌పాటిపై మండిప‌డుతున్నారు.
అయితే, ఇదే స‌ర్వేపై ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌, కేటీఆర్‌ల మ‌ధ్య కొన్ని రోజులుగా మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి విధిత‌మే. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం నాడు మీడియాతో మాట్లాడిన కేటీఆర్ తీవ్ర స్థాయిలో రాజ‌గోపాల్‌పై మాట‌ల తూటాలు పేల్చారు. ల‌గ‌పాటి రాజ‌గోపాత్ ప‌క్కా వ్యూహంతోనే ఈ స‌ర్వేను తారు మారు చేశార‌ని, స‌ర్వే తారుమారు వెనుక ఎవ‌రెవ‌రు ఉన్నార‌న్న విష‌యం త‌న‌కు స్ప‌స్టం తెల‌స‌న్నారు.ఇక ఇదే విష‌యమై కేటీఆర్ మాట్లాడుతూ గ‌త నెల న‌వంబ‌ర్ 20వ తేదీన ల‌గ‌డ‌పాటి త‌న‌కు ఫోన్ చేశాడ‌ని, ఆ స‌మ‌యంలో త‌న టీమ్ తెలంగాణ‌లో చేసిన స‌ర్వేలో టీఆర్ఎస్ 65 నుంచి 70 వ‌ర‌కు సీట్ల‌ను గెలుపొందుతుంద‌ని చెప్పాడ‌న్న విష‌యాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. న‌వంబ‌ర్ 20 నుంచి తాను ఎటువంటి స‌ర్వే చేయ‌లేద‌న్న విష‌యాన్ని కూడా ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ త‌న‌కు తెలిపాడ‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు.అలా, న‌వంబ‌ర్ 20 త‌రువాత ఎటువంటి స‌ర్వే చేయిని ల‌గ‌డ‌పాటి అంత‌కు ముందు తాను చేసిన స‌ర్వే రిపోర్టులో టీఆర్ఎస్ విజ‌యం అని ఉంటే.. ఆ వివ‌రాల‌న్నింటిని తారుమారు చేసేశార‌న్నారు. ల‌గ‌డ‌పాటి స‌ర్వే తారుమారు చేయ‌డం వెనుక చంద్ర‌బాబు, మ‌రో ఇద్ద‌రు మీడియా అధినేత‌లు ఉన్నార‌ని, వారెవ‌రో త‌న‌కు తెల‌స‌ని, ఆ వివ‌రాల‌ను డిసెంబ‌ర్ 11 నాడు వెల్ల‌డిస్తాన‌ని చెప్పారు. 


Related News