//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి 280 కోట్లు దోచుకున్న వజ్రాల వ్యాపారి.. ఎలాగో తెలుసా?

Category : national

తాళాలు పగలకొట్టకుండా మందిని బెదిరించకుండా దర్జాగా దోచుకున్న వజ్రాల వ్యాపారి.కుట్రపూరితంగా తప్పుడు పత్రాలు సమర్పించి, బ్యాంకు నుంచి 280.7 కోట్లు రుణం తీసుకున్న ఓ వజ్రాల వ్యాపారి సహా ఆరుగురిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది.పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కు తప్పుడు పత్రాలు సమర్పించి 280.7 కోట్ల రూపాయల రుణం తీసుకున్న వజ్రాల వ్యాపారి అతని భార్య, సోదరుడు, సన్నిహితుడు వీరితో కుమ్మక్కయిన ఇద్దరు ఇంటి దొంగలు (బ్యాంకు ఉద్యోగులు) సహా ఆరుగురిపై సీబీఐ కేసు నమోదు చేసింది.దాని వివరాల్లోకి వెళ్తే

ఢిల్లీలో ప్రముఖ వజ్రాల వ్యాపారిగా పేరొందిన నిరవ్‌ మోదీ, ఆయన భార్య అమీ, సోదరుడు నిశాల్‌, మరో వ్యక్తి మెహుల్‌ చిన్నూభాయ్‌ చోక్సీలు డైమోన్‌ ఆర్‌ యూఎస్‌, సోలార్‌ ఎక్స్‌ పోర్ట్స్‌, స్టెల్లర్‌ డైమండ్స్‌ సంస్థలలో భాగస్వాములు.ఈ నలుగురితో బ్యాంకు రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్ గోకుల్ నాథ్, మరో అధికారి మనోజ్ కరత్ లు కుమ్మక్కై గత ఏడాది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 280.7 కోట్ల రూపాయల రుణాన్ని ఎలాంటి పూచీకత్తు, నిర్ణీత పత్రాలు లేకుండా మంజూరు చేశారు.

ఈ లావాదేవీలకు సంబంధించిన ఎలాంటి రికార్డు బ్యాంకు సిస్టమ్ లో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిని గుర్తించిన ఉన్నతాధికారులు రికార్డులు పరిశీలించగా ఇంటిదొంగలతో కలిసి చేసిన గోల్ మాల్ బయటపడింది.వీరికి జారీ చేసిన ఎల్ఓయూలు కూడా నకిలీవని తేలడంతో బ్యాంకు ఉన్నతాధికారులు పోలీసులను ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు సీబీఐ దర్యాప్తుకు అప్పగించారు.దీంతో అధికారులు కేసు నమోదు చేశారు.