//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఈనెల 8న "డయల్ యువర్ ఎస్పీడీ''

Category : editorial

ప్రాథమిక విద్యారంగ సమస్యలపై  చర్చించేందుకు ఈనెల 8న  "డయల్ యువర్ ఎస్పీడీ' కార్యక్రమాన్ని రాష్ట్ర సర్వశిక్షా అభియాన్ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ప్రాథమిక విద్యను అభ్యసించే పిల్లలు, వారి తల్లిదండ్రులు నేరుగా ఎస్పీడీ జి. శ్రీనివాస్ కు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చు. ఉచిత పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ క్లాసురూములు, బోధన, ఉపాధ్యాయుల హాజరు, పాఠశాల స్థాయిలో నిధుల వినియోగం తదితర అంశాలపై సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా ఎస్పీడీ దృష్టికి తీసుకెళ్లడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమం గురించి ప్రాథమిక విద్యాబోధన చేసే ప్రతి టీచరు పిల్లలకు వివరించి అవసరమైతే తమ ఫోన్ల ద్వారా పిల్లలతో మాట్లాడించాలని ఆ ప్రకటనలో పేర్కొంది. తమ సమస్యల గురించి తామే మాట్లాడేవిధంగా పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత అని పేర్కొంది. బుధవారం (8వతేదీ) మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 0866 - 2488812, 2488813 నెంబర్లకు ఫోన్ చేసి మాట్లాడొచ్చని తెలిపింది. రికార్డు చేసిన ఈ కార్యక్రమం మరుసటిరోజు (గురువారం) ఉదయం 9గంటలకు ఆల్ ఇండియా రేడియో, విజయవాడ "ఏ' కేంద్రం, ఎఫ్ఎం రెయిన్ బో (102.2) కేంద్రాల నుంచి ప్రసారమవుతుంది. 

Related News